Moviesశ్రీలీల లైఫ్ ఇలా ఉందంటే.. దానికి కారణం ఆ హీరోయిన్ నే...

శ్రీలీల లైఫ్ ఇలా ఉందంటే.. దానికి కారణం ఆ హీరోయిన్ నే అని మీకు తెలుసా..?

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో ఒకటి కలిస్తే మరొకటి జరుగుతూ ఉంటుంది అన్నది చాలా మందికి తెలిసిందే. అలా జరిగి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్లు అయిపోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . ఒకరి కోసం రాసుకున్న కథను ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసి ఆ కథ మరో హీరోయిన్ చేతికి వెళ్లి వాళ్ళు హిట్ కొట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలు తమ ఖాతాలో వేసుకొని .. స్టార్ హీరోయిన్గా పాన్ ఇండియా హీరోయిన్గా ఇండస్ట్రీ నే ఏలేస్తే మకుటం లేని మహారాణిగా ఉన్న ముద్దుగుమ్మలు .. మన ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు . ప్రెసెంట్ ఆలీస్ట్ లో టాప్ పొజిషన్లో ఉంది శ్రీ లీల .

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల తన కెరీర్లో ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు ఒకటి పెళ్లి సందడి – రెండు ధమాకా. పెళ్లి సందడి యావరేజ్ గా మారింది . ధమాకా సూపర్ డూపర్ హిట్ అయింది . ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి రవితేజ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది . అయితే ఈ సినిమా తర్వాత శ్రీలీల రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు బాగా తెలిసిందే. ఇప్పుడు ఆమె చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలు సినిమాల్లో నటిస్తుంది . దానికి మెయిన్ రీజన్ ధమాకా సినిమా అని చెప్పాలి.

అయితే ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా అనుకునింది డైరెక్టర్ పూజ హెగ్డే అంటూ తెలుస్తుంది . అయితే కథ నచ్చిన సరే రవితేజ హీరో అన్న కారణంగా పూజా రిజెక్ట్ చేసిందట . అప్పటివరకు వరుసఫ్లాపుల్లో ఉన్న రవితేజతో సినిమాలో ఎలా నటించగలను అంటూ ముందుగానే సినిమా ఫ్లాప్ అవుతుందని గెస్ చేసి సినిమా నుంచి తప్పుకుందట . అయితే తనకంటే వయసులొ డబుల్ అయిన హీరోతో నటించడానికి సిద్ధపడి శ్రీలీల పెద్ద సాహసమే చేసింది .

దేవుడు కరుణించాడు .. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా తర్వాత అమ్మడు ఏకంగా 10 సినిమాలకు సైన్ చేసింది. అంతేకాదు శ్రీలీల ప్రజెంట్ తన ఖాతాలో ఉన్న “ఉస్దాత్ భగత్ సింగ్” సినిమా సైతం పూజ హెగ్డే హీరోయిన్ అయితే లాస్ట్ మూమెంట్లో ఆమెను తీసేసి శ్రీలీల ని పెట్టుకున్నారు . అంతేనా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల కన్నా ముందుగా పూజ హెగ్డే నే అనుకున్నారు. అయితే శ్రీలీల వచ్చిన తర్వాత పూజ హెగ్డే డిసప్పాయింట్ అయి సినిమా నుంచి తప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలా తెలిసో తెలియకో పూజా హెగ్డే – శ్రీలీల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది .దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news