Moviesగుట్టుచప్పుడు కాకుండా సీక్రేట్ గా రష్మిక ఏం చేసిందో చూడండి..ఈ...

గుట్టుచప్పుడు కాకుండా సీక్రేట్ గా రష్మిక ఏం చేసిందో చూడండి..ఈ పిల్ల మామూల్ది కాదండోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో రష్మిక మందన క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. కాగా ఈ మధ్యకాలంలో హిట్ కొట్టని రష్మిక మందన పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఓ వైపు షూట్లో పాల్గొంటూనే మరోవైపు తన ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్ళలకు హీట్ పెంచేస్తున్న రష్మిక మందన రీసెంట్గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సినిమా చూసింది.

వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలై 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ప్రస్తుతం ఈ మూవీ సినీ లవర్స్ ని ఆకట్టుకునేస్తుంది . ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది . హృదయ కాలేయం ఫెమ్ సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . కాగా ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు పలువురు స్టార్ సెలబ్రిటీస్ కంగ్రాజులేషన్స్ విషెస్ చెబుతున్నారు . ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలు రాశి కన్నా – రష్మిక మందన లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా చూసి తమ విషెస్ ను అందించారు .

వారు థియేటర్లో సందడి చేసిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది . కాగా బేబీ ప్రీమియర్ చూడడానికి స్టార్ హీరోయిన్ రష్మిక మందన సీక్రెట్ గా థియేటర్ కి వచ్చిన క్లిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. బ్లూ జీన్స్ ..వైట్ టీ షర్ట్ .. బ్లాక్ క్యాప్ ఫేస్ కి మాస్క్ పెట్టుకొని మరీ బేబీ సినిమాను సీక్రెట్ గా చూడడానికి వచ్చింది రష్మిక అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

దానికి కారణం తన అన్న విజయ్ దేవరకొండ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . సెలబ్రిటీ ప్రీమియర్ షో నడుస్తున్న స్క్రీన్ వన్ లోకి గుట్టుచప్పుడు కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కి సంబంధించిన పిక్స్ ఇప్పటి ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. అంతేకాదు ఆనంద్ దేవరకొండ సినిమా నుంచి ఓ పాటను సైతం రిలీజ్ చేసింది రష్మిక . దీంతో మరిది కోసం ఇలా చేస్తుంది రష్మిక అంటూ అప్పుడు జనాలు కామెంట్స్ కూడా చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news