Moviesఅఫిషియల్: మళ్ళీ ఆ హీరోతో చేతులు కలిపిన త్రివిక్రమ్.. ఇక బాక్స్...

అఫిషియల్: మళ్ళీ ఆ హీరోతో చేతులు కలిపిన త్రివిక్రమ్.. ఇక బాక్స్ ఆఫిస్ షేక్ అయిపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భలే సెట్ అవుతూ ఉంటాయి . ఒక్కసారి ఆ క్రేజీ కాంబోలో సినిమా పడి హీట్ అయిందంటే .. మళ్ళీ మళ్ళీ ఆ కాంబోపై అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు . కాగా అలాంటి ఓ క్రేజీ కాంబో ని సెట్ చేశారు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది . ఇప్పటికీ వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలను జనాలు ఎంతో ఇష్టంగా టీవీలో చూస్తూ ఉంటారు ..అంటే దానికి మెయిన్ రీజన్ వీళ్లిద్దరి మధ్య ఉన్న సింక్ అని అంటుంటారు జనాలు.

కాగా అలాంటి కాంబో మళ్లీ సెట్ అవుతుందని తెలిసి జనాలు ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు . తివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్లో బన్నీ నటించబోతున్నాడు . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇది సినిమానా..? లేక యాద్ నా..? అన్నది తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్స్ స్పాట్ లో ఉన్న ఓ పిక్ని ఆహా అధికారికంగా విడుదల చేసింది .

ఈసారి మరింత గ్రాండ్ గా ఉండబోతుంది అంటూ ప్రకటించింది . దీంతో బన్నీతో ఏదైనా షో ప్లాన్ చేస్తున్నారా..? లేక ఆహా కోసం యాడ్ చేస్తున్నారా..? అని జనాలు చర్చించుకుంటున్నారు . అంతేకాదు ఈ ఫోటోలో శ్రీలీల కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – అల్లు అర్జున్ -శ్రీలీల్ ల పేర్లు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో..? ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. దీనిపై పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news