Movies"మణిరత్నం క్యారెక్టర్ అలాంటిదే.. చాలా సెక్సీగా ఉంటుంది అన్నారు".. హీరోయిన్ ఐశ్వర్య...

“మణిరత్నం క్యారెక్టర్ అలాంటిదే.. చాలా సెక్సీగా ఉంటుంది అన్నారు”.. హీరోయిన్ ఐశ్వర్య సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబెల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ సైతం మణిరత్నం డైరెక్షన్లో ఒక్కటంటే ఒక్క సినిమా అయినా చేయాలి అని ఉంది అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. అలాంటి ఓ క్రేజీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మణితత్నం డైరెక్షన్లో అవకాశం వస్తే ఎవరైనా సరే వదులుకోరు. అది ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసేస్తారు.

తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది ఐశ్వర్య లక్ష్మి . ఇలా చెప్తే జనాలకి పెద్దగా గుర్తుపట్టలేరు . మట్టి కుస్తీ సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ అంటే మాత్రం టక్కన గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఫేస్ ని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంది ఈ బ్యూటీ . రీసెంట్గా ఈ బ్యూటీ పోనియన్ సెల్వన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. పోనియన్ సెల్వన్ సినిమాలో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ఐశ్వర్య ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుంగోళీ అనే పాత్రలో మెరిసి అభిమానులను మెప్పించింది .

నిజానికి ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు తన క్యారెక్టర్ టైం పెద్దగా లేదని రిజెక్ట్ చేయాలనుకుందట . కానీ మణిరత్నమే ఆమెను దగ్గరుండి ఈ సినిమాకు ఒప్పించారు అంటూ చెప్పుకొచ్చింది . ఆమె మాట్లాడుతూ ..”ఈ క్యారెక్టర్ నేను చేయగలనా లేదా..? అంటూ సందేహం ఉండేది . పైగా పాత్ర తక్కువ ..నాకు ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా ..? అంటూ భయపడ్డాను . కానీ మణిరత్నం డైరెక్షన్ అనగానే ఎక్కడో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే మణీ బాధపడకండి మీరు దీనిని ఈజీగా చేసేయగలరు ..మీ పాత్ర చాలా సెక్సీగా ఉంటుంది.. స్క్రీన్ పై కొద్దిగా టైం మీరు కనిపించిన సరే.. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి పాత్రను నేను మీకు ఇస్తున్నాను అంటూ ప్రామిస్ చేశారు. అలా మోటివేట్ చేయబట్టే నేను ఆ సినిమాలో అంత బాగా నటించగలిగాను.. ఇప్పటికీ ఈ సినిమాలో నా పాత్రను చాలా మంది జనాలు లైక్ చేస్తున్నారు ..అంటే నాకు చాలా గర్వంగా ఉంది .. ఈ పాత్ర ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను ..మరీ ముఖ్యంగా మణీ సార్ డైరెక్షన్లో సినిమా అంటే మాత్రం అసలు మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను “అంటూ చెప్పకు వచ్చింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news