Movies5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో....సినిమా ఇండస్ట్రీపై ప్రగతి ఆంటీ షాకింగ్...

5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో….సినిమా ఇండస్ట్రీపై ప్రగతి ఆంటీ షాకింగ్ కామెంట్స్…!

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ప్రగతి అనే కంటే ప్రగతి ఆంటీ గా ఎక్కువగా కుర్రాళ్లకు దగ్గర అయింది. ప్రస్తుతం సినిమాల్లో అత్త తల్లి వంటి పాత్రలు చేస్తూ ప్రగతి అదరగొడుతోంది. ఎఫ్ 2 సినిమాలో అత్తగా నటించి తన నటనతో మెప్పించింది. కామెడీ, ఎమోషనల్, సీరియస్ ఇలా అన్ని పాత్రల‌లోనూ ప్రగతి జీవించేస్తుంది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇక కేవలం సినిమాల‌ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ వీడియోలు మరియు డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ హీరోయిన్ లు సైతం కుళ్ళుకునే విధంగా అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ప్రగతికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇక బోల్డుగా కనిపించడమే కాకుండా ఇంటర్వ్యూలలోను ప్రగతి బోల్డ్ గా మాట్లాడుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై ప్రగతి స్పందించింది.

కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా పరిశ్రమ మొత్తాన్ని నిందించ‌డం కరెక్ట్ కాదని చెప్పింది. సక్సెస్ సాధించిన ఏ హీరోయిన్ కూడా తనుకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని చెబుతుందని తెలిపింది. సక్సెస్ లేక ఫ్లాప్ అయిన హీరోయిన్లు మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తార‌ని స్పష్టం చేసింది. కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కొన్ని జరగవచ్చని అలాంటివాళ్లు ప్రతి రంగంలో ఎక్కడో ఒకచోట ఉంటారని… కానీ అందరూ అలాంటి వాళ్ళు అనుకోవడం పొరపాటు అని చెప్పింది.

హీరోయిన్ ల‌పై కోట్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వాళ్లకి కావలసినంత పారితోషికం ఇవ్వడం కేవలం ఐదు నిమిషాల సుఖం కోసం కాదు అంటూ లాజిక్ మాట్లాడింది. ఫలానా అమ్మాయి అందుకు ఒప్పుకుంటే ఛాన్స్ ఇస్తా…. అంటే కుదరదు అని చెప్పింది. ఆ అమ్మాయికి ఆ రోల్ సెట్ కావడం అనేది అక్కడ చాలా ముఖ్యమని చెప్పింది. హీరోయిన్ ల‌ కెరీర్ ను కాస్టింగ్ కౌచ్ ప్రభావితం చేస్తుందంటే తాను నమ్మనని తెలిపింది. టాలెంట్ ఉంటే కాస్త లేట్ అయినా మంచి ఆఫర్స్ వస్తాయని స్పష్టం చేసింది. తను ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా కానీ ఎలాంటి నెగెటివిటీ కనిపించలేదని ప్రగతి వెల్లడించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news