Moviesప్రభాస్ తో ఆ స్టార్ హీరో ఫిక్స్..ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే షేక్...

ప్రభాస్ తో ఆ స్టార్ హీరో ఫిక్స్..ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే షేక్ అయ్యే బిగ్గెస్ట్ మల్టీస్టారర్..!!

ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్లర్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మొదలైన ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ , విక్రమ్ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా గత మూడు నాలుగేళ్లుగా ఇండియన్ సినిమాలో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందరికీ తెలిసిందే .

సంచలన కాంబినేషన్లు సెట్ చేస్తూ భాషల మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తున్నాయి . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఇలాంటి క్రమంలోనే పఠాన్ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ .. మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కి ప్లాన్ చేసాడు. రీసెంట్గా రిలీజ్ అయిన పఠాన్ సినిమా ఏ రేంజ్ లో పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా సినిమాకే హైలైట్ గా నిలిచాయి యాక్షన్ సీన్స్ . ఈయన నుండి వచ్చే నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని జనాలు ఆలోచిస్తుండగా..అద్దిరిపోయే న్యూస్ లీకైంది. ప్రభాస్ – హృతిక్ రోషన్ లతో కలిసి మల్టీ స్టార్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం బాహుబలి లాంటి మరో హిట్ ప్రభాస్ ఖాతాలో పక్కా అంటున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news