Moviesఅంత న‌మ్ముకుంటే స‌మంత నిండా ముంచేసిందా...!

అంత న‌మ్ముకుంటే స‌మంత నిండా ముంచేసిందా…!

స్టార్ బ్యూటీ సమంత నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేశాక కూడా క్రేజ్ త‌గ్గ‌లేద‌ని అయితే ఫ్రూవ్ చేసుకుంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఊ అంటావా ఐటెం సాంగ్ కుర్రాళ్ల‌నే కాదు దేశ‌వ్యాప్తంగా అంద‌రిని పిచ్చెక్కించేసింది. ఓ ఊపు ఊపి ప‌డేసింది. అస‌లు ఈ సాంగ్‌లో స‌మంత ఆర‌బోసిన అందాలు చూసినోళ్లంతా అస‌లు ఈమెనేనా ? నాగ‌చైత‌న్య పెళ్లి చేసుకుంది.. ఆమె ఈమె కాదు.. ఈ సాంగ్‌లో చేసింది వేరే స‌మంత అన్న రేంజ్‌లో అందాలు ఆర‌బోసేసింది.

విడాకులు ఇచ్చేసినా కూడా స‌మంత‌కు అవ‌కాశాలకు అయితే కొద‌వ‌లేదు. య‌శోద లాంటి థ్రిల్ల‌ర్ సినిమాతో పాటు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుత‌లం, బాలీవుడ్‌లో మ‌రో సినిమాకు ఓకే చెప్పింది. ఇక గ‌త నెల‌లో య‌శోద ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సమంత ఫేస్ చూసే ఈ సినిమాకు రు. 50 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్‌, డిజిట‌ల్‌, ఓటీటీ బిజినెస్ జ‌రిగింది.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాలో స‌మంత న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు మంచి మార్కులు వేశారు. అయితే క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు. క‌రోనా నేప‌థ్యంలో సినిమాకు వ‌డ్డీలు కూడా ఎక్కువే అయ్యాయి. స‌మంత ఫేస్ చూపించి భారీ రేట్ల‌కు నిర్మాత‌లు అమ్మేశారు. పైగా పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేశారు. సినిమా తెలుగు వ‌ర‌కు ఓ మోస్త‌రుగా ఆడినా పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది.

ఇక నిర్మాత‌లు ముందుగానే స‌మంత ఫేస్ చూపించి డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా చాలా తక్కువ రేటుకే అమ్మేశారు. అయితే స‌మంత‌ను న‌మ్మి కోట్లు ఖ‌ర్చు చేసిన నిర్మాత‌ల‌కు ఈ సినిమాతో పెద్ద‌గా ఒరిగిందేమి లేద‌ని… ఎంతోకొంత న‌ష్టాలే మిగిలాయ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి. రేపు భారీ బ‌డ్జెట్‌తో గుణ‌శేఖ‌ర్ తీసిన శాకుంత‌లం సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అంత ఆశాజ‌న‌కంగా లేద‌నే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news