Movies"మనకి రాసిపెట్టలేదు సార్ వదిలేయ్యండి"..ఫైనల్లీ..ఆ విషయాని ఒప్పేసుకున్న డార్లింగ్..!!

“మనకి రాసిపెట్టలేదు సార్ వదిలేయ్యండి”..ఫైనల్లీ..ఆ విషయాని ఒప్పేసుకున్న డార్లింగ్..!!

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ఈ అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు . ఇప్పటికే ఎపిసోడ్ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ప్రోమో ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో మిలియన్ వ్యూయ్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది .

కాగా రీసెంట్గా జనాలను మరింత ఊరిస్తూ మరో ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ క్రమంలోనే బాలయ్య.. ప్రభాస్ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలందరూ ఎక్కువగా డిస్కస్ చేసే అంశం ప్రభాస్ పెళ్లి , టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..పెళ్లి చేసుకుంటే చూడాలన్నది కోట్లాదిమంది ఫ్యాన్స్ కళ . అంతేకాదు ఆయనను అభిమానించే స్టార్స్ కల కూడా. ఇదే విషయాన్ని బాలకృష్ణ ..ప్రభాస్ ని డైరెక్ట్ గా అడిగేసాడు .

“పెళ్లెప్పుడు చేసుకుంటావు ” అంటూ ప్రభాస్ ని స్టేజిపైనే అడగగా ..ఆయన సమాధానం ఇస్తూ “మనకు రాసిపెట్టలేదు అనుకుంటాను సార్ “..అంటూ చెప్పుకొస్తారు. దీంతో బాలకృష్ణ సైతం..” మీ అమ్మకు చెప్పిన డైలాగులు నాకు చెప్పొద్దు “అంటూ కౌంటర్ ఇస్తాడు . దీంతో ప్రభాస్ పెళ్లి పై జరిగిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ షోలో తనకు హీరోయిన్ అనుష్కకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా బయటపెట్టినట్లు సమాచారం అందుతుంది . అంతే కాదు ఈ ఎపిసోడ్ ని బాహుబలి సినిమా లాగా రెండు పార్టులుగా విడదీసి స్ట్రీమింగ్ చేస్తున్నారు ఆహా. చూడాలి మరి ఫాన్స్ కు తెలియని ఎన్ని విషయాలు రెబెల్ హీరో బాలయ్యతో పంచుకున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news