Movies3 కోట్ల ఇల్లు - కోటి రూపాయల కారు...! హరితేజ ఆస్తులు...

3 కోట్ల ఇల్లు – కోటి రూపాయల కారు…! హరితేజ ఆస్తులు చూస్తే కళ్లు జిగేలే…!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం అంటే అంత సులభం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అలా కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. యాంకర్, నటి హరితేజ కూడా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో హరితేజ టీవీ సీరియల్స్ లో నటించింది. అయితే సీరియల్స్ ద్వారా అంతగా క్రేజ్ సంపాదించుకోలేదు.

కానీ 2007లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అ..ఆ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశాన్ని అందుకుంది. అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో హరితేజ నటనపై త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు. దాంతో హరితేజ ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయింది. త్రివిక్రమ్ చెప్పినట్టుగానే హరితేజ సినిమాలో తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంది.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో జెన్యూన్ గా ఉంటూ హరితేజ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సీజన్ లో టాప్ 3 లో నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా నటిగా హరితేజ ఫుల్ బిజీగా మారిపోయింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమెకు పాపులారిటీ బాగా పెరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం హ‌రితేజ చేతినిండా సంపాదిస్తోంది. యాంకర్ గా సినిమా ఫంక్షన్లకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

అలాగే టీవీ షోల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తోంది. ఇక ఇప్పటికే హరితేజ మూడు కోట్ల విలువచేసే లగ్జరీ ఇంటిని నిర్మించుకుంది. గతంలో యుట్యూబ్ ఛానల్ లో హోమ్ టూర్ చేసి తన ఇంటిని చూపించింది. అంతేకాకుండా హరితేజ కోటి రూపాయల విలువచేసే వోల్వో ఎస్ యు వీ కారును కొనుగోలు చేసింది. వీటితో పాటు సినిమాల ద్వారా , టివి షోల ద్వారా హ‌రితేజ ఇప్ప‌టికే కోట్ల‌లో సంపాదించినట్టు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news