Moviesబిగ్ షాక్‌... మ‌హేష్‌కు న‌చ్చ‌లేదంతే... త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది..!

బిగ్ షాక్‌… మ‌హేష్‌కు న‌చ్చ‌లేదంతే… త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది..!

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది అన్న గాసిప్ బాగా వైరల్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరగాల్సిన ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఫైట్ మాస్టర్లు పేకప్ చెప్పేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అసలు వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. గత కొద్ది నెలలుగా ఊరిస్తూ వస్తున్న‌ త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ఓ యాక్షన్ సీన్ తో ప్రారంభించాడట దర్శకుడు త్రివిక్రమ్.

ఈ యాక్షన్ సీన్ పెద్దది. ఈ యాక్షన్ సీన్లో కొంత ఇండోర్లో వేసిన సెట్లోనూ… మరికొంత రామోజీ ఫిలింసిటీ లో చిత్రీకరించాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారట. ఈ భారీ యాక్షన్స్ కు కేజిఎఫ్ – విక్రమ్ సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేసిన అంబు – అరివులను తీసుకున్నారు. వీరిద్దరు కూడా రామ్ – లక్ష్మణ్‌ మాస్టర్ల మాదిరిగానే కవల పిల్లలు. ప్రస్తుతం వీరు దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ ఫైట్ మాస్టర్లుగా ఉన్నారు. వీరికోసమే స్పెషల్ చెఫ్ ఉంటాడు. పైగా అతడికి కూడా కారు సమకూర్చాలి.

ఈ ఖర్చులన్నీ నిర్మాత ఖాతాలోనే పడతాయి. ఇక మహేష్ బాబు అంటే భారీ యాక్షన్ చేయటం కాస్త అనుమానంగానే ఉంటుంది. మహేష్ తాళ్ళు కట్టి మరి భారీ ఫైట్లు చేసేందుకు పెద్దగా సుముఖ‌త వ్యక్తం చేయడు అని అంటుంటారు. మహర్షి సినిమా సమయంలోనే యాక్షన్ ఎపిసోడ్లు చేసేందుకు ఏసీ ఫ్లోర్లో పశువులు పాక సెట్ వేశారన్న టాక్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్ చేయాల్సి రావటంతో అన్నపూర్ణాలో సెట్ వేశారట.

అయితే ఫైట్ మాస్టర్ల వ్య‌వ‌హారం.. వారి ప‌నితీరు మహేష్ కు నచ్చకపోవడంతో అన్నపూర్ణాలో షూటింగ్ ఆపేసారని తెలిసింది. దీంతో ఫైట్ మాస్టర్లు కూడా వెనక్కు వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోకి ఫైట్ మాస్టర్ల బిహేవియర్ నచ్చకపోవడంతోనే వాళ్ళు వెళ్లిపోయారని అంటున్నారు. అయితే సినిమా మేకర్లు మాత్రం అదేం లేదని.. మరో 3 – 4 రోజుల్లో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని చెబుతున్నారట. అయితే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో మాత్రం హీరోకు ఫైట్ మాస్టర్ల‌కు పడక‌పోవ‌డంతోనే సినిమా షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news