Movies' బింబిసార ' సెన్షేష‌న‌ల్ రికార్డ్‌... 2 రోజుల్లోనే కొట్టేసింది...!

‘ బింబిసార ‘ సెన్షేష‌న‌ల్ రికార్డ్‌… 2 రోజుల్లోనే కొట్టేసింది…!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ మూఈ బింబిసార. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బింబిసార‌కు వ‌చ్చిన ప్రి రిలీజ్ బ‌జ్ మ‌రే సినిమాకు రాలేదు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కు క‌ళ్యాణ్‌రామ్‌కు చెప్పుకోద‌గ్గ హిట్ బింబిసార రూపంలో వ‌చ్చింది. తొలి రోజే సినిమాకు అదిరిపోయే టాక్ వ‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ డే రు. 6.3 కోట్ల షేర్‌తో దుమ్ము దులిపేసింది. నైజాంలో అయితే కేవ‌లం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రై సెన్షేష‌న‌ల్ రికార్డ్ కొట్టింది.

నైజాంలో ఫ‌స్ట్ డే జి ఎస్ టి తో కలిపి 1.77 కోట్లు షేర్ రాబట్టగా రెండు రోజులకి గాను 3.87 కోట్లు మార్క్ కు చేరువైంది. ఇక ఈ సినిమాకు అక్క‌డ రు. 4 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌గా ఇది రెండు రోజుల‌కే చేరువ కావ‌డంతో ఆదివారం నుంచే ఈ సినిమాకు లాభాల పంట పండ‌నుంది. ఏపీ తెలంగాణాలో బింబిసార‌కు రు.15 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఆదివారంతో అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

రెండు రోజుల‌కే ఈ సినిమా రు. 11 కోట్ల షేర్ దాటేసింది. ఇక మూడో రోజు సింపుల్‌గానే బ్రేక్ ఈవెన్‌ను దాటేయ‌నుంది. ఏదేమైనా గ‌త రెండు నెల‌లుగా టాలీవుడ్‌కు స‌రైన హిట్ లేదు. ఇక ఈ శుక్ర‌వారం వ‌చ్చిన సీతారామం, బింబిసార రెండు సినిమాల‌తో మ‌ళ్లీ ఇండ‌స్ట్రీకి పున‌ర్వైభ‌వం వ‌చ్చింద‌నే చెప్పాలి. బింబిసార రెండు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 1.77 కోట్లు
వైజాగ్ – 65 లక్షలు
సీడెడ్ – 95 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
గుంటూరు – 32 లక్షలు
నెల్లూరు – 11 లక్షలు
ఈస్ట్ – 27 లక్షలు
వెస్ట్ – 18 లక్షలు
————————————————–
రెండు రోజుల వ‌సూళ్లు = రు. 4.50 కోట్లు
————————————————–

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news