Movies2022 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్ ' బింబిసార ' నే.....

2022 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట‌ర్ ‘ బింబిసార ‘ నే.. లెక్క‌లు చెపుతోన్న అస‌లు నిజాలు…!

టాలీవుడ్ లో గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా చాలా ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సంక్రాంతికి నాగార్జున బంగార్రాజు సినిమాతో సందడి చేశాడు. ఆ తర్వాత మార్చి నుంచి వరుసగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. రవితేజ ఖిలాడి ఆ తర్వాత పవన్ కళ్యాణ్- రానా భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్‌, ఎన్టీఆర్- రామ్ చరణ్ త్రిబుల్ ఆర్, చిరంజీవి- రామ్ చరణ్ ఆచార్య, కన్నడ డబ్బింగ్ మూవీ కేజిఎఫ్ 2 రిలీజ్ అయ్యాయి.

ఇందులో కేజిఎఫ్ 2- త్రిబుల్ ఆర్- బంగార్రాజు- భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే జూలై నెల మాత్రం టాలీవుడ్‌కు కలిసి రాలేదు. జూన్‌లో మేజర్ సినిమాతో పాటు కమల్‌హాసన్ డబ్బింగ్ మూవీ విక్రమ్‌ మాత్రమే హిట్ అయ్యాయి. జూలైలో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగచైతన్య థాంక్యూ, రామ్ ది వారియర్, రవితేజ రామారావు అండ్ డ్యూటీ భారీ నష్టాలు చూసాయి. అయితే ఆగస్టు నెల మాత్రం టాలీవుడ్‌కు సరికొత్త ఉత్సాహం ఇచ్చింది.

వైజయంతి మూవీస్ వారి సీతారామం, నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా ఒకేరోజు రిలీజ్ అయ్యి రెండు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వచ్చిన నితిన్ మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచినా నిఖిల్ కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ అయింది. ఈనెల 25న వస్తున్న విజయ్ దేవరకొండ లైగ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిదో నెల పూర్తవబోతోంది. ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని సినిమాలు వచ్చినా వసూళ్లు… లాభాలపరంగా చూసుకుంటే మాత్రం కళ్యాణ్ రామ్ బింబిసారా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి.. అమ్మిన రేట్లు, వచ్చిన వసూళ్లు చూసుకుంటే త్రిబుల్ ఆర్, కేజిఎఫ్, బంగార్రాజు, భీమ్లా నాయక్ కంటే కూడా బింబిసార సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు రూపాయికి రూపాయిన్న‌ర వరకు ఇప్పటికే లాభాలు కళ్ళచూశారు. ఈ సినిమా ఫైనల్ బాక్సాఫీస్ ర‌న్‌ పూర్తయ్యేసరికి మరిన్ని లాభాలు రానున్నాయి. బింబిసార‌ను కళ్యాణ్ రామ్ రు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు శాటిలైట్, డిజిల్ డిజిటల్ హక్కుల ద్వారా 25 కోట్ల రూపాయలు వచ్చేశాయి. ఈ సినిమా థియేటర్ హక్కులు రు. 15 కోట్లకు అమ్ముడుపోగా.. ఇప్పటికే ఏకంగా రు. 30 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

మరోవైపు గ్రాస్ వ‌సూళ్లు రు. 65 కోట్లు దాటేశాయి. ఇంకా బింబిసార బుకింగ్స్ అదిరిపోతున్నాయి. బీ, సీ సెంటర్లలో దుమ్ము రేపుతోంది. బయర్లకు తక్కువ రేట్లకే అమ్మడంతో వాళ్లందరూ కళ్ళు చెదిరే లాభాలు సొంతం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే బింబిసార‌ సినిమాకు 40 కోట్లకు పైగా లాభాలు వస్తాయని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే కళ్యాణ్ రామ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. కేవలం మూడు రోజుల్లోనే ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news