Movies' బింబిసార ' 3 డేస్ క‌లెక్ష‌న్స్‌... క‌ళ్యాణ్‌రామ్ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

‘ బింబిసార ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… క‌ళ్యాణ్‌రామ్ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ బింబిసార సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్ల‌తో దూసుకుపోతోంది. తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ 3 రోజుల‌కే ఏపీ, తెలంగాణ‌లో రూ. 15.90 కోట్ల భారీ షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేటర్ రైట్స్ రు.15 కోట్ల రేంజ్‌లో అమ్మారు. అంటే ఫ‌స్ట్ వీకెండ్‌కే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసింది.

నైజాంతో పాటు కొన్ని చోట్ల అయితే ఇప్ప‌టికే లాభాల్లోకి కూడా వ‌చ్చేసింది. డిస్ట్రిబ్యూట‌ర్లు అంద‌రూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక సోమ‌వారం నుంచి ఈ సినిమాకు వ‌చ్చే వ‌సూళ్లు అన్నీ కూడా లాభాలే కానున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో బింబిసార దున్నేసుకోనుంది. సోమ‌వారం కూడా బుకింగ్‌లు స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికే బింబిసార రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని అంటున్నారు.

ఓ వైపు సీతారామం లాంటి క్లాస్ మూవీ నుంచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ఉన్నా కూడా బింబిసార భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఇక బింబిసార యూఎస్‌లోనూ టాప్ లేపుతోంది. యూఎస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా $300K వసూలు చేసింది. సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుండటంతో బింబిసార‌కు ఇటు ఏపీ, తెలంగాణ‌తో పాటు అటు ఓవ‌ర్సీస్‌లోనూ స్క్రీన్లు పెంచేశారు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ జోరు చూస్తుంటే బింబిసార డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన ప‌టాస్ సినిమా వ‌సూళ్ల‌ను బింబిసార తొలి నాలుగైదు రోజుల‌కే క్రాస్ చేసేయ‌నుంది. లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో నెట్ వ‌సూళ్లు రాబ‌డుతుందా ? అన్న దానిపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news