Moviesబింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ' హార్ట్ ట‌చ్ చేసిన ఎన్టీఆర్...

బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ‘ హార్ట్ ట‌చ్ చేసిన ఎన్టీఆర్ ‘ సెంటిమెంట్‌…!

టాలీవుడ్‌లో రిలీజ్‌కు రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న బింబిసార ఒక‌టి. మూడేళ్లుగా క‌ళ్యాణ్‌రామ్ ఈ ప్రాజెక్టు మీద వ‌ర్క‌వుట్ చేశాడు. క‌ళ్యాణ్‌రామ్ త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో రు. 37 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి తెర‌కెక్కించిన ఈ సినిమా ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

క్రీస్తు శ‌కం 5వ శ‌తాబ్దానికి చెందిన మ‌గ‌ధ రాజు బింబిసారుడి జీవిత చ‌రిత్ర ఆధారంగా బింబిసార తెర‌కెక్కింది. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ థెస్రా, సంయుక్త మీన‌న్ న‌టించారు. యూనిక్ స్టోరీ లైన్‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్ జోడీంచి ఈ సినిమాను ప్ర‌జెంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేస్తున్నారు.

ఇక గ‌త రాత్రి జ‌రిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రావ‌డంతో భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. త్రిబుల్ ఆర్ ఫంక్ష‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ చాలా రోజుల‌కు ఓపెన్ ఫంక్ష‌న్లో క‌నిపించారు. తార‌క్ స్వ‌యంగా ప్ర‌మోష‌న్ల‌కు దిగ‌డంతో పాటు ఈ సారి బింబిసార ఖ‌చ్చితంగా హిట్ కొడుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెప్ప‌డంతో బింబిసార గురించి ప్రేక్ష‌కుల్లో ఎక్కువుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

బింబిసార ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడిన మాట‌లు హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉన్నాయి. మాకు ఆస్తులు ఏం అక్క‌ర్లేద‌ని… మా తాత గారు, నాన్న గారు మా ఫ్యామిలీకి మీలాంటి గొప్ప అభిమానుల‌ను ఇచ్చార‌ని.. మీరే మాకు ఆస్తులు అని… ఎల్ల‌ప్పుడు మీకు రుణ‌ప‌డి ఉంటామ‌ని ఫ్యాన్స్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో మ‌రోసారి ఎన్టీఆర్ చెప్పాడు. ఎన్టీఆర్‌కు ముందు నుంచి ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఫ్యాన్స్ ఏ ఇబ్బందుల్లో ఉన్నా వెంట‌నే స్పందిస్తాడు.

ఇక ప్ర‌తి సినిమా ఫంక్ష‌న్ అయిపోయాక ఫ్యాన్స్ ఇంటికి వెళ్లేముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చెప్పి మ‌రీ పంపిస్తాడు. ఎన్టీఆర్‌కు సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఫ్యాన్స్ కోసం ప్రాణం ఇస్తాడు. బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్ ముగిశాక కూడా అలాగే జాగ్ర‌త్త‌లు చెప్పి పంపించాడు. బింబిసార‌కు ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్ చేయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను భుజాన‌కెత్తుకోనున్నారు. అది సినిమాకు ఖ‌చ్చితంగా ప్ల‌స్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news