Moviesఎన్టీఆర్ ఎక్కువ సార్లు రొమాన్స్ చేసిన హీరోయ‌న్లు వీళ్లే... తార‌క్‌కు ఎవ‌రు...

ఎన్టీఆర్ ఎక్కువ సార్లు రొమాన్స్ చేసిన హీరోయ‌న్లు వీళ్లే… తార‌క్‌కు ఎవ‌రు ల‌క్కీ హీరోయిన్ అంటే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం తన కేరియ‌ర్ లోనే ఎప్పుడు లేనంత పుల్ ఫామ్‌లో ఉన్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి ఈ ఏడాది వ‌చ్చిన RRR సినిమా వ‌ర‌కు వ‌ర‌స‌గా 6 సూప‌ర్ హిట్‌ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భారీ క్రేజి పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 20 సంవ‌త్స‌రాల త‌న కేరీర్‌లో 30 సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో కొంద‌రు హీరోయిన్స్‌తో రిపీటెడ్‌గా న‌టించాడు. ఆ హీరోయిన్స్ ఎవ‌రో ?వీళ్ల‌లో ఎవ‌రు ? ఎన్టీఆర్‌కు క‌లిసి వ‌చ్చిన ల‌క్కీ హీరోయిన్సో చూద్దాం.

గ‌జాలా : స్టూడెంట్ నెంబ‌ర్ 1, అల్ల‌రి రాముడు
ఎన్టీఆర్ తొలి హిట్ సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ 1లో న‌టించ‌న గ‌జాలా .. మారోసారి బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల్ల‌రిరాముడు సినిమాలోను న‌టించింది. గ‌జాలా న‌టించిన రెండు సినిమాలు సూప‌ర్ హిట్లు అయ్యాయి. స్టూడెంట్ నెంబ‌ర్ 1 రాజామౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి ఎన్టీఆర్‌కు యూత్‌లో తిరుగులేని క్రేజ్ తీసుకువ‌చ్చింది. అలాగే అల్ల‌రి రాముడు క‌మార్షియ‌ల్ స‌క్సెస్‌ అయింది.

భూమిక : సింహాద్రి, సాంబ‌
హీరోయిన్ భూమిక ఎన్టీఆర్‌తో రాజామౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు సాంబ సినిమాలోను న‌టించింది. ఈ రెండు సినిమాల‌లో సింహాద్రి ఇండ‌స్ట్రీ హిట్ కాగా.. సాంబ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

జెనీలీయా : నా అల్లుడు, సాంబ‌
జేనీలీయా ఎన్టీఆర్ తో ముళ్ల‌పూడి వ‌ర‌ డైర‌క్ష‌న్‌లో వ‌చ్చిన నా అల్లుడు, వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సాంబ సినిమాలో రెండూ హీరోయిన్ గా చేసింది. నా అల్లుడు డిజాస్ట‌ర్ కాగా.. సాంబ యావేర్‌జ్‌గా నిలిచింది. జెనీలియా ఎన్టీఆర్‌కు పెద్దగా క‌లిసి రాలేదు అని చెప్పాలి.

ఇలియానా : రాఖీ, శ‌క్తి
బ‌క్క‌ప‌ల‌చ‌ని భామ ఇలియానా కూడా ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ‌క్తి ఘెర‌మైన డిజాస్ట‌ర్ కాగా… కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాఖీ సినిమా హిట్ గా నిలిచింది. ఇలాయానాతో చేసిన రెండు సినిమాల్లో ఒక‌టి హిట్‌.. మ‌రొక‌టి ఫ‌ట్ అయ్యాయి.

స‌మీరారెడ్డి : అశోక్‌, న‌ర‌సింహుడు
తెలుగు అమ్మ‌యి స‌మీరా రెడ్డి ఎన్టీఆర్ తో అశోక్‌, న‌ర‌సింహుడు సినిమాల‌లో న‌టిచింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్‌గా నిలిచాచయి. ఎన్టీఆర్‌కు ఏ హీరోయిన్‌తోను గాసిప్పులు రాలేదు… కాని స‌మీరా రెడ్డి విష‌యంలో మాత్రం ఎన్టీఆర్ గాసిప్పులు ఎదుర్కోవాల్పి వ‌చ్చింది. పైగా ఇటు ఆమెతో చేసిన సినిమాలు క‌లిసి రాలేదు.

స‌మంత‌: బృందావ‌నం, జ‌న‌తా గ్యారేజ్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌
ఎన్టీఆర్‌కు క‌లిసి వ‌చ్చిన హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌టి. స‌మంత‌తో తార‌క్ నాలుగు సినిమాల‌లో న‌టించారు. బృందావ‌నం, జ‌న‌తాగ్యారేజ్ హిట్ సినిమాలు కాగా. రామ‌య్య వ‌స్తావ‌య్యా, ర‌భ‌స అంచ‌నాలు అందుకోలేక‌పోయాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఒక హీరోయిన్‌తో నాలుగు సినిమాల‌లో న‌టించిన ఘ‌న‌త స‌మంత‌కు మత్ర‌మే ద‌క్కింది.

ఆర్తీ అగ‌ర్వాల్‌: అల్ల‌రి రాముడు, న‌ర‌సింహుడు స్పెష‌ల్ సాంగ్‌
అప్ప‌ట్లో ఒక ఊపు ఊపేసిన దివంగ‌త ఆర్తీ అగర్వాల్ అల్ల‌రి రాముడులో మెయిన్ హీరోయిన్ కాగా.. న‌ర‌సింహుడు సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. అల్ల‌రి రాముడు క‌మ‌ర్షియ‌ల్‌ హిట్‌కాగా… న‌ర‌సింహుడు బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయింది.

కాజ‌ల్ అగ‌ర్వాల్ : బృందావ‌నం, టెంప‌ర్‌, బాద్‌షా
ఇక ఎన్టీఆర్‌కు బాగా క‌లిసి వ‌చ్చిన హీరోయిన్ ఎవ‌రు ? అంటే క‌చ్చితంగా కాజ‌ల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో బృందావ‌నం, టెంప‌ర్‌, బాద్‌షా సినిమాలు చేస్తే మూడు సూప‌ర్ హిట్లు అయ్యాయి. కాజ‌ల్‌తో ఎన్టీఆర్‌కు ఒక్క‌ ప్లాప్ సినిమా కూడా లేదు. కాజ‌ల్ ఆ త‌ర్వాత స‌మంత ఎన్టీఆర్‌కు ల‌క్కీ హీరోయిన్స్ అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news