Moviesఆ తెలుగు యంగ్ హీరోకి ఎన్టీఆర్ అంత దగ్గరి బంధువా..? అందుకే...

ఆ తెలుగు యంగ్ హీరోకి ఎన్టీఆర్ అంత దగ్గరి బంధువా..? అందుకే సపోర్ట్ చేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉన్నారు. ఈ విషయం మనకు తెలిసిందే . అయితే చాలామంది తమ బంధుత్వాలను బయట పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు . రీజన్ ఏంటో తెలియదు .. కానీ కొంతమంది దగ్గర రిలేషన్ షిప్స్ అయినా సరే ఆ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు . తాజాగా అలాంటి ఓ రిలేషన్షిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే మరో హీరో రామ్ పోతినేని కి బ్రదర్ అవుతారు. ఈ విషయాన్ని స్వయాన రామ్ పోతినేని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రెసెంట్ రాం పోతినేని కెరియర్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒక హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు . అయితే ఎన్టీఆర్ “దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు. మరొక పక్క బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు .

బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయాడు ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. రీసెంట్గా ఆయన ఓ నైట్ డిన్నర్ పార్టీలో కూడా మెరిశారు . ఇలాంటి మూమెంట్లోనే రాం పోతినేని స్వయంగా ఎన్టీఆర్ కి బ్రదర్ అవుతాడు అనే విషయం కూడా బాగా వైరల్ గా మారింది . పలువురు నందమూరి – రామ్ పోతినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ బ్రదర్స్ కాంబోలో ఒక్క సినిమా వస్తే బాగుండు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news