Moviesచిరంజీవి ఫేవరెట్ హీరో - హీరోయిన్ ఎవరో తెలుసా? అస్సలు గెస్...

చిరంజీవి ఫేవరెట్ హీరో – హీరోయిన్ ఎవరో తెలుసా? అస్సలు గెస్ చేయలేరు..!

ఇండస్ట్రీలోనే కాదు సామాన్య జనాలను ఎవ్వరు అడిగినా సరే మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి . అంతకన్నా ముందు చెప్పే పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఆల్మోస్ట్ ఆల్ ఆ పేరు తర్వాత అందరూ జనాలు కామన్ గా చెప్పే పేరు మాత్రం మెగాస్టార్ చిరంజీవినే. వందలో 90 శాతం మంది ఈ పేరుని చెప్తూ ఉంటారు. అయితే అటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది .

ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి . మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..ఆయన తన కెరియర్ లో నటించిన ప్రతి సినిమాలోను డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ వచ్చారు. 68 ఏళ్ల ఏళ్లలో కూడా యంగ్ హీరోస్ కి ధీటుగా కాంపిటీషన్ ఇస్తూ తన సత్తా చాటుతున్నారు . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే .

కాగా మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న తన ఇంట్లోనే బోలెడు మంది హీరోలు ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ నటన ..స్టైల్.. డాన్స్ అంటే చిరంజీవికి చాలా చాలా ఇష్టమట . అంతేకాదు ఇష్టమైన హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలామంది పేర్లే చెప్పుకొచ్చారు .

పలు సందర్భాలలో సౌందర్య ..అదేవిధంగా రాధికా ..రాధ అని చెప్పుకొచ్చారు. సౌందర్య ప్రవర్తించే తీరు మాట్లాడే పద్ధతి చిరంజీవికి బాగా ఇష్టమట . అంతేకాదు సౌందర్యతో నటించినప్పుడు ఉండే కంఫర్ట్ వేరే ఏ హీరోయిన్తో నటించినప్పుడు కూడా ఉండదు అంటూ చెప్పుకొచ్చారు . రాధికా- రాధ ల తో నిత్యం ఫోన్లో టచ్ లోనే ఉంటాను అని .. వాళ్ళ పేరు చెప్పకపోతే నన్ను తిడతారు అని సరదాగా చెప్పుకొచ్చారు . మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రెసెంట్ వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news