Moviesటాలీవుడ్ లో ఇలియానాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆ డైరెక్టర్ నేనా..?...

టాలీవుడ్ లో ఇలియానాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆ డైరెక్టర్ నేనా..? ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటిరా బాబు..!

ఇలియానా .. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరుకు పెద్ద చరిత్ర ఉంది . మరీ ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా అమ్మాయి నడుములను కంపేర్ చేసి చూపించాలి అంటే ఇలియానా నడుము చూడండి ..ఇలియానా బెల్లీ చూడండి అని చెప్పేవాళ్ళు . ఇలియానా పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించింది. నడుమును గిరగిరా తిప్పేసి స్టెప్స్ వేయడంలో ఇలియానా తర్వాతే ఎవరైనా ..సూపర్ హాట్ ఫిగర్ ..మెయింటైన్ చేసిన ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది .

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా సినిమాలో హీరోయిన్ గా నటించి తన పేరు మరింత రేంజ్ లో మారు మ్రోగిపోయేలా చేసుకునింది . కాగా ఆ తర్వాత పలువురు స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . ప్రజెంట్ ఇలియానా పొజిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. తెలుగులో ఒక్క అవకాశం లేదు నమ్మిన బాలీవుడ్ కూడా ముంచేసింది . అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలియానా టాలీవుడ్ లో తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం. ఓ డైరెక్టర్ అంటూ చెప్పకనే చెప్పేసింది.

దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత ఆమె బాలీవుడ్లోకి వెళ్లిపోయింది . అక్కడ బర్ఫీ సినిమాలో నటించింది . మంచి హిట్ అందుకుంది. అప్పుడే తెలుగులో ఒక టాప్ డైరెక్టర్ ఇలియానా ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తుంది . తెలుగులో చేయదు .. అక్కడ ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి .. తెలుగు డైరెక్టర్స్ ను చులకనగా చేస్తుంది అంటూ లేనిపోని విషయాలను బాగా ట్రెండ్ చేశారట. ఆ కారణంగానే పలువురు ఇలియానాకు అవకాశాలు ఇవ్వాలి అనుకున్న కూడా ఇవ్వకుండా ఆగిపోయారట . ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పుకోరావడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news