Moviesవిక్రమార్కుడు2 లో హీరోయిన్ ఎవరో తెలుసా..? అనుష్కను మించిపోయే ఫిగర్.. ఇక...

విక్రమార్కుడు2 లో హీరోయిన్ ఎవరో తెలుసా..? అనుష్కను మించిపోయే ఫిగర్.. ఇక కెవ్వు కేక అంతే..!

ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెంద్ గా మారిపోయింది . మనం చూస్తూనే ఉన్నాం . కొత్త సినిమాలు తెరకెక్కించడం రావడం లేదో..? లేకపోతే కొత్త కంటెంట్ తెరకెక్కించాలి అన్న ఆలోచనను మానేసుకున్నారో.. రీజన్ ఏంటో తెలియదు కానీ కొంతమంది డైరెక్టర్స్ గతంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను సీక్వెల్ పేరట మళ్లీ వాటిపై ప్రయోగం చేస్తున్నారు . ఆల్మోస్ట్ అందరి డైరెక్టర్ లు ఇప్పుడు ఇదే తంతును కొనసాగిస్తున్నారు . తాజాగా ఇండస్ట్రీలో ఓ హిట్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది .

అయితే ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వేరు సీక్వెల్ తెరకెక్కించబోతున్న డైరెక్టర్ వేరు అంటూ ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా విక్రమార్కుడు. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రవితేజ హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఎగబడి చూస్తారు . అలాంటి ఓ మాస్ పవర్ఫుల్ పర్ఫామెన్స్ అందించాడు రవితేజ. ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అని రవితేజ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాగా ఇన్నాళ్లకు ఆ టైం దగ్గర పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ బాగా వైరల్ గా మారింది . అయితే ఈ సినిమా సీక్వెల్ ని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో హీరోగా రవితేజ నటిస్తూ ఉండగా హీరోయిన్గా మాత్రం మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట . అనుష్క ఈ సినిమాను రిజెక్ట్ చేసిన కారణంగానే మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news