Moviesఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వెళ్తే ఆ పని మాత్రం చేయకూడదు.. మృణాల్...

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వెళ్తే ఆ పని మాత్రం చేయకూడదు.. మృణాల్ కు మైండ్ బ్లాకింగ్ కండిషన్ పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని చాలా చాలా మంది అమ్మాయిలు ఆశపడుతూ ఉంటారు. అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు . అయితే కొంతమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చినా సరే తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను బాగా ఫాలో అవుతూ ఉంటారు . జనరల్గా చాలామందికి ఒక అపోహ ఉంటుంది . ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వస్తే సిగ్గు విడిచి ఎలాంటి రోల్స్ లోనైనా నటిస్తారు ..? ఎలాంటి పాడు పనులైనా చేస్తారు..? బరితెగించినటిస్తారు..? అని అనుకుంటూ ఉంటారు .

కొంతమంది హీరోయిన్స్ అలా ఉండొచ్చు.. కానీ కొంతమంది మాత్రం అలా ఉండనే ఉండరు అంటూ తాజాగా మృణాల్ ఠాకూర్ మాట్లాడిన మాటలు ఆధారంగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ .. ఆమె నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయింది . కానీ ఆమె పేరు మాత్రం ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె అందం . కాగా రీసెంట్గా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో చిట్ చాట్ చేసింది.

ఈ క్రమంలోనే తన తండ్రి ఆమెకు పెట్టిన కండిషన్ గురించి ఓపెన్ గా చెప్పుకు వచ్చింది. ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వెళ్తాను అన్న మూమెంట్లో తన ఫాదర్ ఆమెకు క్రేజీ కండిషన్ పెట్టారట . అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. “మా నాన్నగారు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వెళ్తాను అన్నప్పుడు నో చెప్పలేదు . అబ్జెక్షన్స్ ఏమీ చెప్పలేదు .. కానీ ఒకే ఒక కండిషన్ మాత్రం పెట్టారు సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్ళాక ఎక్కడ కూడా మా పరువు తీసే పని చేయకూడదు .. బోల్డ్ సీన్స్ లిప్ లాక్ సీన్స్ లో అస్సలు నటించకూడదు.. నువ్వు తెరపై అలా నటిస్తే మేము చూడలేం .. మా మనసు విరిగిపోతుంది .. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయొద్దు.. అలా అయితేనే హీరోయిన్గా వెళ్ళు.. లేదంటే లేదు ” అంటూ తేల్చి చెప్పారట .

అయితే నిన్న మొన్నటి వరకు కూడా నాన్న పెట్టిన కండిషన్ ని ఏం మాత్రం దాటలేదు అని.. కానీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక కచ్చితంగా అలాంటివి చేయాల్సి వస్తుంది అని రీసెంట్ గానే తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news