Moviesబాల‌య్య‌కు అరుదైన గౌరవం.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు సూప‌ర్ కిక్ ఇచ్చే అప్‌డేట్‌..!

బాల‌య్య‌కు అరుదైన గౌరవం.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు సూప‌ర్ కిక్ ఇచ్చే అప్‌డేట్‌..!

నేటితరం హీరోలకు పోటీగా ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ. అప్ప‌టి త‌రం హీరోల‌తో పోల్చి చూస్తే బాల‌య్య ఈ వ‌య‌స్సులోనూ అంతే ఎన‌ర్జీతో యాక్టింగ్‌లో దూసుకుపోతున్నాడు. అస‌లు అఖండ సినిమా చూస్తే బాల‌య్య డైలాగ్ డెలివ‌రీ, డ్యాన్సులు, యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌తులు పోగొట్టేస్తుంటాయి.

అఖండ జోష్‌లో ఉన్న బాల‌య్య ఇప్పుడు వ‌రుస‌గా క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌లినేనీ గోపీచంద్ డైరెక్ష‌న్‌లో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రెడ్డిగారు, జై బాల‌య్య అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడితో బాల‌య్య నెక్ట్స్ సినిమా ఉంది. ఆ సినిమాలో బాల‌య్య కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే బాల‌య్యకు ఇప్పుడు ఉన్న క్రేజ్‌కు మ‌రింత ఊపు వ‌చ్చే వార్త ఒక‌టి వినాల్సిందే. ఈ అప్‌డేట్ వింటే బాల‌య్య ఫ్యాన్స్ హుషారెత్తిపోతారు. బాల‌య్య‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. బాల‌య్య‌కు
సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అంద‌చేయ‌బోతున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న స్టార్ హీరోకు ఇంత‌కు మించిన గౌర‌వం ఏం  ఉంటుంద‌నే చెప్పాలి.

మ‌హాక‌వి సి. నారాయ‌ణ‌రెడ్డి 91వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈ నెల 30న హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో ఈ పుర‌స్కారం బాల‌య్య‌కు ఇస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్‌. విద్యాసాగ‌ర్ రావు హాజ‌రు అవుతున్నారు. ఇక బాల‌య్య‌కు ఈ అరుదైన పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల నంద‌మూరి అభిమానుల ఆనందం మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news