Movies' బింబిసార ' ర‌న్ టైం ఎన్ని నిమిషాలు అంటే... క‌ళ్యాణ్‌రామ్‌కు...

‘ బింబిసార ‘ ర‌న్ టైం ఎన్ని నిమిషాలు అంటే… క‌ళ్యాణ్‌రామ్‌కు ప‌టాస్‌ను మించిన హిట్టే..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొత్త ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేసే విష‌యంలో ఎప్పుడూ ముందుంటాడు. సురేంద‌ర్‌రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త క‌ళ్యాణ్‌రామ్‌కే ద‌క్కుతుంది. వీరిద్ద‌రు అత‌నొక్క‌డే, ప‌టాస్ సినిమాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌లోనే మెగాఫోన్ ప‌ట్టుకుని డైరెక్ట‌ర్లుగా ప‌రిచ‌యం అయ్యారు. ఇక ఈ క్ర‌మంలోనే క‌ళ్యాణ్‌రామ్ కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిష్ట మ‌ల్లిడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ బింబిసార నిర్మించారు.

రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌ళ్యాణ్‌రామ్ క‌నిపిస్తున్నాడు. క‌ళ్యాణ్‌కు జోడీగా సంయుక్త మీన‌న్‌, కేథ‌రిన్ థెస్రా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకువ‌చ్చాయి. నిన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన రెండో ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాలు తారాస్థాయికి తీసుకుపోయింది.

ఆగ‌స్టు 5న బింబిసార రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఎంతో గ్రాండ్‌గా తెర‌కెక్కించిన ఈ సినిమాకు రు. 37 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ అయ్యిందంటున్నారు. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సినిమా ర‌న్ టైం 2 గంటల 26 నిముషాలని తెలుస్తోంది. ఇంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సోషియో ఫాంట‌సీ సినిమాకు 146 నిమిషాల ర‌న్ టైం అంటే చాలా క్రిస్పీ అనే చెప్పాలి.

ఇక సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉంద‌ట‌. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ కు ఇదే తొలి సినిమా అయినా చాలా ప‌గ‌డ్బందీగా సినిమాను తీశాడ‌ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఎప్ప‌ట‌కీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని.. ప‌టాస్‌ను మించిన భారీ హిట్ అవుతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కెమేరామెన్ చోటా కె. నాయుడు సైతం బింబిసార రిలీజ్ అయ్యాక క‌ళ్యాణ్‌రామ్‌కు మార్కెట్ పెరుగుతుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news