Moviesఎన్టీఆర్ వేసుకున్న ఈ టీ ష‌ర్టుకు ఇంత స్పెషాలిటీ ఉందా...!

ఎన్టీఆర్ వేసుకున్న ఈ టీ ష‌ర్టుకు ఇంత స్పెషాలిటీ ఉందా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో వ‌రుస‌గా త‌న ఖాతాలో ఆరో హిట్ ప‌డింది. ఈ త‌రం జ‌న‌రేష‌న్లో వ‌రుస‌గా ఆరు హిట్లు ఉన్న హీరోలు ఎవ్వ‌రూ లేర‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా రెండు భారీ పాన్ ఇండియా సినిమాల‌ను ఎన్టీఆర్ ప‌ట్టాలు ఎక్కిస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా తెర‌కెక్కుతోంది. ఆ వెంట‌నే కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31వ సినిమా ఉండ‌నుంది. ఈ రెండు కూడా భారీ అంచ‌నాల‌తోనే తెర‌కెక్కుతున్నాయి.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమా కోసం తన లుక్‌ను, మేకోవ‌ర్‌ను మార్చుకునే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన బింబిసారా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన స్పీచ్ ఫ్యాన్స్ మ‌న‌స్సును ట‌చ్ చేసింది. ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు ఓ టీ ష‌ర్ట్‌తో వ‌చ్చాడు. బ్లాక్ టీ ష‌ర్ట్ తో వ‌చ్చిన ఎన్టీఆర్ చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాడు.

ఈ టీ ష‌ర్ట్ రేటు రు. 30 వేలు అని నెటిజ‌న్లు సెర్చింగ్‌లో ప‌ట్టేశారు. ఎన్టీఆర్ చాలా కాస్ట్ లీ వ‌స్తువులు వాడుతూ ఉంటాడు. ఎన్టీఆర్ వేసుకునే టీ ష‌ర్ట్‌తో పాటు పెట్టుకునే వాచీ, వాడే కార్లు కూడా చాలా ఖ‌రీదైన‌వే. ఎన్టీఆర్ త‌న ఐటెం, కాస్ట్యూమ్స్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌డు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ చాలా ఖ‌రీదైన టీ ష‌ర్టుతో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చాడు.

ఇక బింబిసార సినిమాపై త‌న‌కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంద‌ని.. సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఎన్టీఆర్ ధీమా వ్య‌క్తం చేశాడు. ఎన్టీఆర్ ఇప్ప‌టికే బింబిసార ప్రివ్యూ షో కూడా చూశాడు. క‌ళ్యాణ్‌రామ్ త‌న సొంత బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కేథ‌రిన్ థెస్రా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news