Moviesఆ స్టార్ హీరోయిన్ కౌగిలింత కోసం హీరో కావాల‌నే టేకులు తీసుకునేవాడా..!

ఆ స్టార్ హీరోయిన్ కౌగిలింత కోసం హీరో కావాల‌నే టేకులు తీసుకునేవాడా..!

ఓ సినిమాలో ఓ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ల‌లో ప‌దే ప‌దే న‌టించేందుకు.. ఆమెను కౌగిలించుకునేందుకు ఓ స్టార్ హీరో ప‌దే ప‌దే టేకులు తీసుకోవ‌డం విచిత్ర‌మే. అంటే ఆ హీరోయిన్‌పై స‌ద‌రు హీరోగారికి ఎంతో ప్రేమ ఉంది.. ఆ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకే స‌ద‌రు హీరో కెమేరామెన్‌తో ఒప్పందం కుదుర్చుకుని కావాల‌నే ఆ సీన్ స‌రిగా రాలేదంటూ ఎక్కువ టేకులు తీసుకునేవాడ‌ట‌. అయితే ఈ టైప్ వార్త‌లు మ‌నం చాలా రోజుల నుంచి చూస్తున్న‌వే.

ఇండియ‌న్ క్లాసిక్ మూవీ షోలే సినిమా టైంలో బాగా వినిపించిన స్పైసీ గాసిప్ ఇదే. హీరో ధ‌ర్మేంద్ర హీరోయిన్ హేమ‌మాలినితో చేసిన రొమాంటిక్ చిలిపి ప‌ని ఇది. ఆ త‌ర్వాత కాలంలోనే ధ‌ర్మేంద్ర‌కు భార్య అయ్యింది హేమ‌మాలిని. హేమ‌మాలినిని ధ‌ర్మేంద్ర పీక‌ల్లోతులో మునిగిపోయి మ‌రీ ప్రేమిస్తున్నాడు. అయితే అప్ప‌టికే ఆయ‌న‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు. హేమ కూడా కావాలని.. హేమ లేక‌పోతే తాను లేనంత పిచ్చోడైపోయాడు.

షోలో షూటింగ్ టైంలో ప్ర‌తిసారి ఏదో త‌ప్పు చేసేలా స్పాట్ బాయ్‌, కెమేరామెన్‌, లైట్‌బాయ్‌కు ముందే మ‌నోడు డైరెక్ష‌న్ ఇచ్చేసేవాడ‌ట‌. దీంతో ప‌దే ప‌దే ఆ సీన్‌ను షూట్ చేసేలా చేసి హేమ‌మాలినిని ఆ వంక‌తో గ‌ట్టిగా వాటేసుకునేవాడ‌ట‌. ఇందుకోసం ఆ రోజుల్లోనే స్పాట్‌బాయ్‌లు, లైట్‌బాయ్‌ల‌కు రు. 2 వేలు ఇచ్చేవాడ‌ట‌. అలా కౌగిలించుకునే క్ర‌మంలోనే ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచాడ‌ట‌.

చివ‌ర‌కు పెళ్లి కోసం మ‌తం మారే ఎత్తుగ‌డ కూడా ధ‌ర్మేంద్ర‌దే అట‌. ఆ త‌ర్వాత హేమ ధ‌ర్మేంద్ర‌కు భార్య అయ్యింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి కూడా అయ్యింది. అయితే ధ‌ర్మేంద్ర మొద‌టి భార్య సంతానం మాత్రం వీళ్ల‌ను అంగీక‌రించిన‌ట్టుగా ఉండ‌రు. అయితే రెండు కుటుంబాల మ‌ధ్య దూరం మెయింటైన్ చేసే విష‌యంలో ధ‌ర్మేంద్ర కూడా చాలా క‌ఠినంగానే ఉంటాడ‌ని చెప్పుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news