Moviesఈ టాలీవుడ్ హీరోలు ఇంత దారుణంగా త‌యార‌య్యారా... ఇదేం క‌క్కుర్తి రా...

ఈ టాలీవుడ్ హీరోలు ఇంత దారుణంగా త‌యార‌య్యారా… ఇదేం క‌క్కుర్తి రా అయ్యా..!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోల తీరు దారుణంగా మారుతోంది. డ‌బ్బుకోసం ప‌చ్చ‌గ‌డ్డి కూడా తినేస్తార‌న్న విమ‌ర్శ‌లు ఇప్పుడు కొంద‌రు హీరోల‌పై వినిపిస్తున్నాయి. ఇక నిర్మాత‌లు సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌కులు, హీరోల‌కు అడ్వాన్స్‌లు ఇవ్వ‌డం ఎప్పటి నుంచో వ‌స్తోందే. అయితే ఈ అడ్వాన్స్‌లు తీసుకుని ఏళ్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా.. ప‌దేళ్లు దాటుతున్నా కూడా కొంద‌రు హీరోలు ఆ నిర్మాత‌ల‌కు సినిమాలు చేయ‌డం లేదు. అయితే అడ్వాన్స్ తీసుకున్న డ‌బ్బులు కూడా వెన‌క్కు ఇవ్వ‌రు.. వాళ్లు మాత్రం అటు డ‌బ్బు ఇవ్వ‌కుండా.. ఇటు సినిమా చేయ‌కుండా ఫ్రీగా వ‌డ్డీ లేని అప్పును మ‌రో రంగంలో పెట్టుబ‌డి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వ‌స్తున్నారు.

టాలీవుడ్‌లో పెద్ద నిర్మాణ సంస్థ‌గా ఉన్న మైత్రీ వాళ్లు ఎంద‌రో స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌కు ఏళ్ల క్రిత‌మే భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చారు. మైత్రీ వాళ్ల అడ్వాన్స్‌లు ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఎన్టీఆర్‌కు అడ్వాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసేస్తున్నాడు. ముఖ్యంగా ఓ మిడ్ రేంజ్ హీరోకు ఎప్పుడో రు. 2 కోట్ల అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. స‌ద‌రు హీరోను ఎప్పుడు సినిమా చేయ‌మ‌ని అడిగినా క‌థ న‌చ్చ‌లేదు.. ద‌ర్శ‌కుడు వ‌ద్ద‌ని చెపుతూ కాల‌క్షేపం చేస్తున్నాడ‌ట‌. రీసెంట్‌గా స‌ద‌రు మిడ్ రేంజ్ హీరోకు దిమ్మ‌తిరిగిపోయే డిజాస్ట‌ర్ వ‌చ్చింది.

రు. 10 కోట్లు పెడితే రు. 2 కోట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఆ హీరో మార్కెట్ ఫూర్తిగా ఢ‌మాల్ అంది. పోనీ అడ్వాన్స్ వెన‌క్కు ఇవ్వ‌మ‌ని అడిగితే క‌థ‌, డైరెక్ట‌ర్ ప‌ట్టుకురండి సినిమా చేస్తా అంటూ త‌ప్పించుకుంటున్నాడ‌ట‌. ఇక మ‌రో మాస్ హీరో నిర్మాత‌ల పాలిట య‌ముడిలా మారిపోమి మ‌రీ డ‌బ్బులు ముక్కు పిండి వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. సినిమా సినిమాకు రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోతూ రు. 10 కోట్ల త‌న రెమ్యున‌రేష‌న్‌ను ఏకంగా రు. 20 కోట్ల‌కు తీసుకుపోయాడ‌ట‌.

ఆయ‌న సినిమాలు కూడా నాలుగైదు చేస్తే ఒక్క‌టే ఆడుతున్నాయి. అయితే స‌ద‌రు హీరో ముందు ఒక రేటు మాట్లాడుకుని డ‌బ్బింగ్ టైంలో నిర్మాత‌ల‌ను బిజినెస్ ఎక్కువ అయ్యింద‌ని బెదిరిస్తూ మ‌రో ఒక‌టి రెండు కోట్లు కూడా లాగేస్తున్నాడ‌ట‌. స‌ద‌రు హీరో వ్య‌వ‌హారం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రో స్టార్ హీరో కూడా అంతే ముందుగానే భారీగా అడ్వాన్స్‌లు తీసేసుకుంటున్నాడు.

అడ్వాన్స్ తీసుకున్నాక ఆరేడేళ్ల‌కు కాని క‌థ‌, డైరెక్ట‌ర్ సెట్ అయ్యాక సినిమా చేయ‌డం లేదు. ఈ లోగా ఈ అడ్వాన్స్‌ను పెట్టుబ‌డులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ సంపాదించుకుంటున్నాడు. స‌ద‌రు హీరోతో
సినిమా అంటే మ‌రీ కాస్ట్‌లీ వ్య‌వ‌హారం అయిపోయింద‌ని నిర్మాత‌లు ల‌బోదిబోమంటున్నారు. పేరుకు మాత్రం స్టార్ హీరోతో పెద్ద సినిమా అని చెప్పుకుంటున్నా లాభాలు వ‌చ్చిన పాపాన పోవ‌డం లేదు. మ‌రి మ‌న హీరోలు ఎప్ప‌ట‌కీ మార‌తారో ? ఏమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news