Moviesప‌వ‌న్ హాట్ హీరోయిన్‌పై గృహ‌హింస కేసు... !

ప‌వ‌న్ హాట్ హీరోయిన్‌పై గృహ‌హింస కేసు… !

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టించిన ఓ హాట్ హీరోయిన్ ఇప్పుడు గృహ‌హింస కేసులో చిక్కుకుని వార్త‌ల్లోకి ఎక్కింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఖుషీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో త‌మిళ న‌టి ముంతాజ్ అతిథి పాత్ర‌లో న‌టించింది. ప‌వ‌న్‌ను సిద్ధూ సిద్ధూ అని వెంట‌ప‌డుతూ వేధిస్తుంది. ఆ సినిమాలో ఆమె ప‌వ‌న్‌తో క‌లిసి గ‌జ్జ‌గల్లుమ‌న్నాదిరో సాంగ్‌లో ర‌చ్చ చేసి కుర్ర‌కారుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ముంతాజ్ అప్ప‌ట్లో మామూలు హాట్‌గా ఉండేది కాదు.

ఆ త‌ర్వాత చాలా యేళ్ల‌కు ఆమె మ‌ళ్లీ తిరిగి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది సినిమాలో కూడా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఓరి దేవుడో దేవుడో అన్న సాంగ్‌లో హంస‌నందిని, ముంతాజ్ క‌లిసి న‌టించారు. వాస్త‌వంగా ముంతాజ్ అస‌లు పేరు గంగ‌. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అమ్మో ఒక‌టో తారాఖు సినిమాలో ఆమె సీనియ‌ర్ హీరో సురేష్ ప‌క్క‌న న‌టించింది. త‌ర్వాత ఆ పేరు కలిసి రావ‌డం లేదని ముంతాజ్‌గా మార్చుకుంది.

తాజాగా ముంతాజ్‌పై గృహ‌హింస కేసు న‌మోదు అయ్యింది. ఆమె త‌మ‌ను నిర్బంధించి బ‌ల‌వంతంగా ప‌ని చేయిస్తున్నారంటూ ఓ బాలిక త‌మిళ‌నాడులోని అన్నాన‌గ‌ర్ పోలీసుల‌ను ఆశ్రయించింది. గ‌త ఆరేళ్లుగా ముంతాజ్ ఇంట్లో ఇద్ద‌రు బాలిక‌లు ఇంటి ప‌ని చేస్తున్నారు. అయితే ఆ ఇద్ద‌రు బాలిక‌ల్లో ఓ బాలిక పోలీసుల‌ను ఆశ్ర‌యించడంతో ఇప్పుడు ముంతాజ్ వార్త‌ల్లోకి ఎక్కింది.

తాను కొద్ది రోజులుగా సొంత ఊరుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే ముంతాజ్ త‌న‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌డం లేద‌ని… త‌న‌ను సొంత ఊరుకు వెళ్ల‌కుండా ఆమె హింసిస్తోంద‌ని ఆ బాలిక త‌న ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ముంతాజ్‌పై గృహ‌హింస కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ముంతాజ్ అన్నాన‌గ‌ర్‌లోని హెచ్ బ్లాక్‌లో త‌న ఫ్యామిలీతో క‌లిసి ఉంటోంది.

శింబు తండ్రి టి. రాజేందర్ రూపొందించిన `మోనీషా ఎన్ మోనాలిసా` చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తెలుగులో చాలా బాగుంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఖుషీతో క్రేజ్ తెచ్చుకుంది. జెమిని – కూలీ – కొండవీటి సింహాసనం – అత్తారింటికి దారేది – ఆగడు సినిమాల త‌ర్వాత ఆమె మ‌ళ్లీ సినిమాల్లో క‌న‌ప‌డ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news