Moviesఅబ్బాయ్ ఎన్టీఆర్‌కు.. బాబాయ్ బాల‌య్య‌కు ఆ ఒక్క తేదీకి ఉన్న లింక్...

అబ్బాయ్ ఎన్టీఆర్‌కు.. బాబాయ్ బాల‌య్య‌కు ఆ ఒక్క తేదీకి ఉన్న లింక్ ఏంటి..!

ప్రజెంట్ వున్న జనరేషన్ లో నందమూరి కుటుంబం అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరోలు నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సో, ఈ బాబాయ్, అబ్బాయ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రేజ్‌లో కానీ, ఫాలోయింగ్‌లో కానీ, నటనలో కానీ ఎవరి ప్రత్యేకత వారిది. అయితే ఈ ఇద్దరు హీరోలకి మార్చ్ 28 తేది కి ఒక ప్రత్యేకమైన సంబధం వుంది. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు ఎవర్ని అడిగినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఇట్టే చెప్పేస్తారు.

ఎన్టీఆర్ డాన్స్ గురించి ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే. ఇండియా వైడ్ టాప్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ ప‌క్క‌న తాము డ్యాన్స్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ప‌డ‌తామ‌ని ఓపెన్‌గానే చెపుతారు. ఇటీవ‌ల‌ తన సినిమాలలోనే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా పాటలు పాడుతూ తనలో వున్న టాలెంట్‌నీ బయట పెట్టారు. ఇక రికార్డ్స్ విషయానికి వస్తె తన కెరీర్ మొదట్లోనే రికార్డ్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు మన యంగ్ టైగర్. అందులో మనం చెప్పుకోవాల్సిన మూవీ ఆది.

ఆది మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్. సరిగ్గా మూతి మీద మీసాలు కూడా రాని టైమ్‌లో ఆది మూవీతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమ్మతొడు.. అడ్డంగా నరికేస్తా…. అనే ఒక్క డైలాగ్ తో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వి.వి వినాయక్ దర్శకత్వంలో కీర్తి చావ్లా హీరోయిన్ గా బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ రోజుల్లోనే 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇండ‌స్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఈ మూవీ మార్చ్ 28, 2002 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అయింది.

 

ఇక నందమూరి నటసింహం బాలయ్య బాబుని గాడ్ ఆఫ్ మాసెస్ అని బాలయ్య అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన తెరమీద కనిపిస్తే చాలు…పునాకాలతో ఊగిపోయే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. బాలకృష్ణ గారి కెరీర్ లో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ ఇలా చాలానే ఉన్నాయి. లెజెండ్ మూవీ మాత్రం తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా అని బాలయ్య గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సింహ మూవీ తరువాత మళ్ళీ అలాంటి హిట్ బాలకృష్ణ గారికి రాలేదు. నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ బోయపాటి డైరెక్షన్ లో లెజెండ్ మూవీ చేశాడు బాల‌య్య‌.

ఆ సినిమా కూడా మార్చ్ 28, 2014 లో రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో మందరికి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో మంచి ఊపు తేవ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్ మాంచి జోష్ నింపింది. లెజెండ్ ఎంత పెద్ద హిట్ అంటే… అప్పట్లో ఈ సినిమా డైలాగ్స్ కీ ఫ్యాన్స్ అందరూ చొక్కాలు చింపుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాలి చౌహాన్ మరియు రాధిక అప్తే హీరోయిన్స్ గా నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా మార్చ్ 28 తేది ఇటు బాబాయ్ బాలకృష్ణకు, అటు అబ్బాయ్‌ జూనియర్ ఎన్టీఆర్ గారికి స్పెష‌ల్ డేగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news