Moviesభీమ్లా నాయక్ విషయంలో చాలా బాధపడుతున్న..సంయుక్త సంచలన ట్వీట్..!!

భీమ్లా నాయక్ విషయంలో చాలా బాధపడుతున్న..సంయుక్త సంచలన ట్వీట్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా..రానా దగ్గుబాటి విలన్ గా నటించిన వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు రిలీజైన మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి..సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిజానికి ఏపీలో టికెట్ రేత్లు కానీ బాగుంటే పవన్ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ నే ఉన్నాయి. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం ..రెండు పవన్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించ్డం..మూడు తమన్ మ్యూజిక్ అద్దిరిపోయింది..నాలుగు సినిమాలో రానా విలన్ గా నటించలేదు జీవించేశాడు. దీంతో ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి ఆదరణ పొందుతోంది. అక్కడ ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అంటున్నారు. ఇక ఇది అలా ఉంటే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన మళయాలి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఈ సినిమ గురించి సాహ్కింగ్ ట్వీట్ చేస్తూ తన మనసులోని మాటను చెప్పేసింది.

ఈ సినిమాలో రానా భార్యగా నటించిన ఈమె నిడివి తక్కువే అయినా..సినిమా కధను మార్చేది ఈమె. సంయుక్త చెప్పడంతోనే పవన్ ..రానాని చపకుండా వదిలేస్తాదు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో సంయుక్త కి పవన్ ఓ మాట ఇచ్చి ఉంటాడు. ఇక దాని కోసం రానా చేసిన అన్ని తప్పులను క్షమిస్తాదు. కాగా ఈ సినిమాను రెండోసారి చూడాలి అనుకుంటున్న ఆమెకు నిరాశే మిగిలిందట. ఎందుకంటే ఎన్ని సార్లు ట్రై చేసినా..ఆమెకు టికెట్లు దొరక్కట్లేదట. దీంతో చాలా బాధపడుతుందట సంయుక్త మీనన్. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవ్వడం హ్యాపీగా ఉందని, నా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నట్టుగా సంయుక్త ట్వీట్ వేసింది. మొత్తానికి భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌తో సంయుక్తకు మున్ముందు మంచి ఆఫర్లే వచ్చేట్టు కనిపిస్తున్నాయి

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news