Moviesనా బెడ్ షేర్ చేసుకునే "మై లవ్" అంటూ క్రేజీ ఫోటోను...

నా బెడ్ షేర్ చేసుకునే “మై లవ్” అంటూ క్రేజీ ఫోటోను షేర్ చేసిన రష్మిక..నెట్టింట ట్రెండింగ్..!!

రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక మోగిపోతున్న పేరు. రష్మీక మందాన అంటే పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దక్షిణాది భాషలన్నింటిలోనూ వరుస సినిమా హిట్లతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది ఈ కన్నడ భామ. శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా ..ఏం చేసినా అది నెట్టింట వైరల్ గా మారుతుంది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే..ఖచ్చితంగా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. సరదాగా మాత్లాదుతూ..అల్లరి చేస్తూ..నవ్విస్తుంటుంది ఈ నేషనల్ క్రష్. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక. మోడలింగ్ రంగంలో నుంచి .. కిర్రాక్ పార్టీ కన్నడ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. కన్నడ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టి తన దైన స్టైల్లో దూసుకుపోతుంది.

ఈ మధ్యనే అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేసి మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ..ప్రజెంట్ శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమాల్లో నటిస్తుంది. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా కానీ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. సినీ ఇందస్ట్రీకి వచ్చిన కొత్తలో నిశ్చితారధం చేసుకుని..బ్రేకప్ చెప్పేసిన అమ్మడు..ప్రజెంట్ విజయ్ దేవరకొండతో లవ్ లో ఉందని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ కోడై కూస్తుంది.

ఈ విషయం పై ఎప్పటికప్పుడు వాళ్ళు మా మధ్య అదేం లేదురా బాబోయ్ అంటూ చెప్పుకొస్తున్నా కానీ ఆ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. రీసెంట్ గా మళ్లీ ఈ మధ్యనే రష్మిక ..విజయ్ తో పెల్లి వార్తల పై స్పందిస్తూ మేము ఫ్రెండ్స్ ఇప్పటికి ఎప్పటికి అంటూ తేల్చి చెప్పింది. అయితే తాజాగా రష్మిక తన పెట్ ఆరా గురించి చెప్పుకొస్తూ.. ఆరా తన ప్రపంచం అయిపోయిందని చెబుతూ .. మై లవ్ అంటూ ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు గతంలోను నా బెడ్ షేర్ చేసునేది ఇదే అంటూ కూడా పోస్ట్ పెట్టింది. దీంతొ రష్మిక లవ్ ఆరా అంటూ నెట్టింత వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news