Moviesనరేష్ కు ఎంత వెతికినా అవి దొరకట్లేదట..బుద్ది ఉందా అంటూ నెటిజన్లు...

నరేష్ కు ఎంత వెతికినా అవి దొరకట్లేదట..బుద్ది ఉందా అంటూ నెటిజన్లు ఫైర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాని షేర్ చేసుకుంటున్నారు జనాలు. అదో అలవాటు లా మారింది. మరీ ముఖ్యంగా..సినీ సెలబ్రిటీలు అయితే వాళ్ళు చేసిన చిన్న పనిని కూడా గొప్పగా చెప్పుకుంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. అది ఏదైనా సమాజానికి ఉపయోగ పడే పని అయితే పర్లేదు. నలుగురికి మంచి జరిగే విషయం అయినా ఓకే కానీ పనికిమాలిన చెత్తను కూడా చెప్పుతుంటే..నెటిజన్లకి కోపం వస్తుంది. ఇంకెముంది వాళ్లని విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. పేస్తుతం అలాగే ఓ సీనియర్ ఆర్టిస్ట్ నెటిజన్స్ కోఫానికి గురైయాడు. మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ నెట్టింట్లో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీస్ లో టాప్ ప్లేస్ లో ఉంటారు సీనియర్ ఆర్టిస్ట్ నరేష్. అవసరం ఉన్నా లేకున్నా ప్రలకు ఉపయోగ పడినా పడకపోయిన్నా నిత్యం ఏదో ఒక ట్వీట్ తో హల్ చల్ చేస్తుంటారు. దీంతో లేనిపోని వివాదాల్లో తలు దూర్చుతుంటారు. ఇప్పటికి మా ఎన్నికల సమయంలో ఈయన చేసిన హడావుడి..ఈయన పై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా మళ్ళి నెగిటివిటీని మూటకట్టుకున్నారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు నరేష్. ఆయన చేసిన ఒక్కే ఒక్క ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా తిరుపతికి వెళ్లినఆయ్న అక్కడ తనకు నచ్చిన మెచ్చిన కావాల్సిన బ్రాండెడ్ షూస్ కోసం తెగ వెతికాడట. సుమారు గంట సేపు తన టైం కెటాయించి.. తనకు కావాల్సిన నైక్ ఏయిర్ షూస్ కొనాలి అని బాగా కష్టపడ్డారట. కానీ తిరుపతి మొత్తం తిరిగినా అవి మాత్రం దొరకలేదట. ఇక అక్కడ దొరకపోయేసరికి.. హైద్రాబాద్ వెళ్లి కొనాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లకు కోపం వచ్చి ..నరేష్ ను బండ బూతులు తిడుతున్నారు. అసలు ఈ ట్వీట్ వల్ల ఎవడికి రా ఉపయోగం అంటూ తిట్టిపోస్తున్నారు. కొందరైతే బుద్ధి ఉందా ఇంత ఏజ్ వచ్చింది ఎటువంటి మెసేజ్ ప్రజలకు షేర్ చేయ్యాలో తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు..ఇది కూడా ట్వీట్ వేయడం అవసరమా? గంటలో ఏం తిరిగావ్.. ఎక్కడెక్కడ తిరిగావ్.. మంచు వాళ్లతో కలిసి నువ్ కూడా అలానే తయారయ్యావ్ అంటూ నానా రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి నరేష్ ట్వీట్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news