MoviesRRR పై ప్ర‌పంచంలోనే ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది... ఎన్టీఆర్ పాత్రే హైలెట్..!

RRR పై ప్ర‌పంచంలోనే ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది… ఎన్టీఆర్ పాత్రే హైలెట్..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఇండియా భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త్రిబుల్ ఆర్‌. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ లాంటి వ‌ర‌ల్డ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో బ‌జ్, బ‌య‌ట హ‌డావిడి చూస్తుంటేనే తెలుస్తోంది. మ‌రో రెండు రోజులు మాత్ర‌మే ఉంది. 24వ తేదీ అర్ధ‌రాత్రి నుంచే త్రిబుల్ ఆర్ హంగామా ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట్ అయిపోతుంది. ఇక 25 వ తేదీ థియేట‌ర్లు అన్ని ద‌ద్ద‌రిల్లి పోతాయి.

ఇక త్రిబుల్ ఆర్ సినిమాపై రాజ‌మౌళితో పాటు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ధీమాగా క‌నిపిస్తున్నారు. అందుకే ప్ర‌మోష‌న్ల‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు టాలీవుడ్ అభిమానులు అంతే జోష్‌లో ఉన్నారు. సినిమా ఎప్పుడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేస్తామా ? అని ఒక్క‌టే ఉత్కంఠ‌తో ఉన్నారు. ఇక తెలుగులో పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా దుబాయ్ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు ముందుగానే అక్క‌డ సెన్సార్ షో చూసి త‌న రివ్యూ చెప్పేస్తూ ఉంటారు.

అయితే గ‌తంలో ఆయ‌న చెప్పిన జోస్యాలు చాలా వ‌ర‌కు రివ‌ర్స్ అయ్యాయి. బాహుబ‌లి ది బిగినింగ్ సినిమాను అట్ట‌ర్ ప్లాన్ అని విమ‌ర్శించాడు. అయితే ఆ సినిమా ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో మ‌నం కూడా చూశాం. ఆ త‌ర్వాత ఉమైర్ సంధు సూప‌ర్ హిట్లు అని చెప్పిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు లాంటి సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి.

అలాంటి ఉమైర్ తాజాగా త్రిబుల్ ఆర్ సెన్సార్ షో చూసి త‌న అభిప్రాయం సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే త‌న ఫ‌స్ట్ రివ్యూ చెప్ప‌క‌నే చెప్పేశాడు. తుది ఫ‌లితం ఎలా ? ఉన్నా కూడా మ‌న తెలుగు వాళ్ల‌కు కొద్ది సంవ‌త్స‌రాల నుంచి ఉమైర్ సంధు రివ్యూల ప‌ట్ల ఎంతో ఆస‌క్తి, ఆతృత ఉంటున్నాయి. ఇక త్రిబుల్ ఆర్‌పై త‌న రివ్యూ కూడా ఇచ్చేశాడు.

సినిమాకు ఎన్టీఆర్ పాత్ర ఆత్మ వంటిది అని.. రామ్‌చ‌ర‌ణ్ త‌న న‌ట‌న‌తో చాలా టెరిఫిక్‌గా న‌టించాడ‌ని.. ఇది డెడ్లీ కాంబినేష‌న్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. త‌న క‌ల‌ల‌కు ప్ర‌తి రూపంగా రాజ‌మౌళి ఈ సినిమాను రూపొందించాడ‌ని కూడా మెచ్చుకోవ‌డంతో పాటు భార‌తీయులు అంద‌రూ గ‌ర్వ‌ప‌డే సినిమా ఇది అవుతుంద‌ని.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంట‌లు రేగ‌డం ఖాయ‌మ‌ని ఉమైర్ ఆకాశానికి ఎత్తేశాడు.

మ‌రి ఉమైర్ చెప్పిన రివ్యూను బ‌ట్టి చూస్తుంటే సినిమా చూస్తుంటే థియేట‌ర్ల‌లో పూన‌కాలు వ‌చ్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యుద్ధం మొద‌లు పెట్టిన ఈ సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news