Moviesదుమ్ము రేపిన విజ‌య్ తెలుగు ' బీస్ట్ ' ప్రి రిలీజ్...

దుమ్ము రేపిన విజ‌య్ తెలుగు ‘ బీస్ట్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌..!

ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ జోసెఫ్ హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ బీస్ట్‌. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తుపాకీ సినిమా నుంచి విజ‌య్ ఇక్క‌డ మంచి మార్కెట్ ప‌దిల ప‌రుచుకున్నాడు. తాజాగా విజ‌య్ న‌టిస్తోన్న బీస్ట్ పై సౌత్ ఇండియాలో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇక కోలీవుడ్‌లో అజిత్ వ‌ర్సెస్ విజ‌య్ ఫ్యాన్స్ మ‌ధ్య ఏ రేంజ్‌లో వార్ న‌డుస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అజిత్ న‌టించిన వ‌లీమై సినిమా వ‌చ్చి ఆయ‌న అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు విజ‌య్ ఫ్యాన్స్ బీస్ట్ ..వ‌లీమై రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని నానా హంగామా చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌లు కూడా మ్యూజిక్ ల‌వ‌ర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక చివ‌రిగా వ‌చ్చిన విజ‌య్ మాస్ట‌ర్ సినిమా తెలుగులో రు. 6 కోట్ల‌కు బిజినెస్ చేస్తే ఏకంగా రు. 14 కోట్ల వ‌సూల్లు కొల్ల‌గొట్టింది. మాస్ట‌ర్‌కు వాస్త‌వంగా తెలుగులో యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. అయినా కూడా రు. 14 కోట్ల వ‌సూల్లు అంటే మామూలు విష‌యం కాదు. ఇప్పుడు బీస్ట్ కు ఇక్క‌డ అంచ‌నాల‌కు మించి భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కు రు. 11 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

మ‌రి సినిమాకు హిట్ టాక్ వ‌స్తే ఈ వ‌సూళ్లు అందుకోవ‌డం సులువే. అయితే ఇప్పుడు టాక్ మీదే తెలుగులో రు. 11 కోట్లు వ‌సూళ్లు చేస్తుందా ? అన్న‌ది డిపెండ్ అయ్యి ఉంది. అయితే త‌మిళంలో బీస్ట్‌ను ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ మ‌రుస‌టి రోజే ఏప్రిల్ 14న పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా నుంచి బీస్ట్‌కు త‌మిళ‌నాడు బ‌య‌ట గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు. అందుకే తెలుగులో అదే రోజున రిలీజ్ చేసే అవ‌కాశాలు అయితే లేవు. ఇక విజ‌య్ సినిమాకు హిట్ టాక్ వ‌స్తే రు. 100 – 150 కోట్లు మంచి నీళ్లు తాగిన‌ట్టుగా వ‌సూలు చేస్తున్నాడు. మ‌రి బీస్ట్‌తో ఇంకెన్ని రికార్డులు కొల్ల‌గొడ‌తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news