Moviesవ‌రుణ్ తేజ్ ల‌వ్ మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చేసిన నాగ‌బాబు.. అమ్మాయి ఎవ‌రంటే...!

వ‌రుణ్ తేజ్ ల‌వ్ మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చేసిన నాగ‌బాబు.. అమ్మాయి ఎవ‌రంటే…!

టాలీవుడ్‌లో పెళ్లి కాకుండా బ్యాచిల‌ర్స్‌గా ఉన్న హీరోల్లో ప్ర‌భాస్ త‌ర్వాత ఎక్కువుగా మెగా ఫ్యామిలీ హీరోలే ఉన్నారు. వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ వీళ్లే ఉన్నారు. ఇక మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడిగా హీరో అయిన వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు టైర్ టు హీరోల్లో స్టార్ హీరో అయిపోయాడు. చాలా త‌క్కువ టైంలోనే వ‌రుణ్‌తేజ్‌కు మంచి హిట్లు ప‌డ్డాయి. ఓ వైపు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ లాంటి క‌థా బ‌లం ఉన్న సినిమాల్లో న‌టిస్తూనే అటు సీనియ‌ర్ హీరోల‌తో ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సినిమాలు కూడా చేస్తున్నాడు. వ‌రుణ్ సింగిల్ మార్కెట్ బాగా బాగా పెరిగింది.

ఇక వ‌రుణ్ తేజ్ సోద‌రి నిహారిక పెళ్లి చేసేసిన నాగ‌బాబు.. ఇప్పుడు వ‌రుణ్ పెళ్లి కూడా చేసి త‌న బాధ్య‌త వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నారు. నిహారిక‌ను గుంటూరు చెందిన జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌కు ఇచ్చి చేశారు. ఇక వ‌రుణ్‌తేజ్ పెళ్లి విష‌యానికి వ‌స్తే ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. ఆమెతోనే వ‌రుణ్ పెళ్లి అవుతుందంటూ ఆరేడు నెల‌లుగా ఒక్క‌టే వార్త‌లు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు లావ‌ణ్య త్రిపాఠి. గ‌తంలో లావ‌ణ్య – వ‌రుణ్ క‌లిసి కొన్ని సినిమాలు కూడా చేశారు.

ఆ టైంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక నిహారిక పెళ్లి రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన‌ప్పుడు కూడా ఆ పెళ్లికి లావ‌ణ్య హాజ‌రు కావ‌డంతో పాటు నిహారిక‌ను ముస్తాబు చేసే కార్య‌క్ర‌మాలు అన్నీ ఆమే దగ్గ‌రుండి మ‌రీ చూసుకుంది. ఇక వ‌రుణ్ రెండు నెల‌ల క్రితం ఓ డైమండ్ రింగ్తో వెళ్లి మ‌రీ ఆమెకు ప్ర‌పోజ్ చేశాడ‌న్న వార్త‌లు వ‌చ్చినా అవ‌న్నీ అబద్ధాలే అంటూ లావ‌ణ్య చెప్పింది.

ఇక తాజాగా నాగ‌బాబును సోష‌ల్ మీడియాలో కొంద‌రు మెగా అభిమానులు వ‌రుణ్‌తేజ్ పెళ్లెప్పుడు సార్ అని ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు నాగ‌బాబు బ‌దులు ఇస్తూ తాను ఇప్ప‌టికే చాలా సార్లు ఈ ప్ర‌శ్న వింటున్నా అని.. ఈ ప్ర‌శ్న‌కు వ‌రుణ్‌బాబే ఆన్స‌ర్ ఇస్తాడ‌ని నాగ‌బాబు చెప్పాడు. గ‌తంలోనూ నాగ‌బాబుకు ఇదే ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు మంచి సంబ‌ధాలు చూడాల‌ని నెటిజ‌న్ల‌కు స‌ల‌హాలు ఇచ్చాడు.

ఇక వ‌రుణ్ ప్రేమ వివాహం చేసుకున్నా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా చెప్పేశాడు. ఓవ‌రాల్‌గా చూస్తే వ‌రుణ్ ప్రేమ వివాహాన్ని నాగ‌బాబు వ‌రుణ్ ఇష్టానికే వ‌దిలేశాడ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి వ‌రుణ్‌తేజ్ మ‌న‌స్సులో ఎవ‌రు ఉన్నారో ? ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news