Moviesఇండియాలోనే ఫ‌స్ట్ గ్రాఫిక్స్ మూవీ ' అమ్మోరు ' తెర‌వెన‌క క‌థ...

ఇండియాలోనే ఫ‌స్ట్ గ్రాఫిక్స్ మూవీ ‘ అమ్మోరు ‘ తెర‌వెన‌క క‌థ ఇదే..!

సినిమాల్లో తెలుగోడి స‌త్తాను దేశ‌వ్యాప్తంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా చాటి చెప్పినోడు ఖ‌చ్చితంగా రాజ‌మౌళీయే. దేశ చ‌రిత్ర‌లోనే ఏ సినిమాకు రాని విధంగా బాహుబ‌లి సీరిస్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగే వ‌సూళ్లు వ‌చ్చాయి. అమీర్‌ఖాన్ దంగ‌ల్ సినిమా క‌థ‌కు యూనివ‌ర్సీల్ అప్పీల్ ఉంది. ఆ సినిమా చైనా వ‌సూళ్లు వ‌దిలేస్తే.. బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాయే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో శిఖ‌రాగ్రాన ఉండేది. ఖ‌చ్చితంగా ఈ క్రెడిట్ రాజమౌళీకే ఇవ్వాలి.

బాహుబ‌లి సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే తెర‌మీద మ‌న‌కు క‌ళ్లు చెదిరిపోతాయి. బాహుబ‌లి గ్రాఫిక్సే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల క‌ళ్ల‌న్నీ త‌న వైపున‌కు తిప్పుకునేలా చేశాయి. అయితే బాహుబ‌లి కంటే రెండు ద‌శాబ్దాల ముందు తెలుగులో అమ్మోరు సినిమా వ‌చ్చి ఎంత సంచ‌ల‌నం క్రియేట్ చేసిందో చూశాం. అస‌లు టెక్నాల‌జీ అంత‌గా లేని రోజుల్లోనే అమ్మోరు సినిమా చూసిన వాళ్లు ఆ గ్రాఫిక్స్ చూసి నోరెళ్ల‌బెట్టారు.

ఈ సినిమా పూర్త‌య్యేందుకు నాలుగు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఎంఎస్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎం. శ్యాం ప్ర‌సాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అప్ప‌ట్లో 1.8 కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా రు. 11 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా అమ్మోరు మాయ‌లో ప‌డిపోయింది. విచిత్రం ఏంటంటే మ‌హాన‌టి సౌంద‌ర్య కెరీర్‌లో 4వ సినిమాగా ప్రారంభ‌మైన అమ్మోరు ఆమె 27వ సినిమాగా రిలీజ్ అయ్యింది. ఆ గ్యాప్‌లో సౌంద‌ర్య 24 సినిమాలు చేసేసింద‌న్న‌మాట‌.

తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఈ సినిమాను త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోకి డ‌బ్ చేస్తే.. అక్క‌డ కూడా కోటి రూపాయ‌ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాలో అమ్మోరుగా ర‌మ్య‌కృష్ణ న‌ట విశ్వ‌రూపం చూసిన జ‌నాలు పూన‌కంతో ఊగిపోయారు. ఈ సినిమా కంటే ముందే గ్రాఫిక్స్ సినిమాలు విఠ‌లాచార్య‌వి ఉన్నాయి. అయితే పూర్తిస్థాయి గ్రాఫిక్స్‌గా ఉన్న సినిమా మాత్రం అమ్మోరే. ఈ సినిమాకు తండ్రి, కొడుకులు అయిన చ‌క్ర‌వ‌ర్తి, శ్రీ కొమ్మినేని ఇద్ద‌రూ మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news