Moviesవామ్మో..ఫ్రిజ్‌లో ఈగలు దాచిన జక్కన్న ..దానికోసమేనట..!!

వామ్మో..ఫ్రిజ్‌లో ఈగలు దాచిన జక్కన్న ..దానికోసమేనట..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఈగ ఒకటి. అప్పటి వరకు ఒక లెక్క.. ఆ తరువాత మరొక లెక్క అనేలా ఈగ టాలీవుడ్ స్థాయిని అమాంతంగా పెంచేసింది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎలాంటి సినిమా అయినా చేయగలడని ఆ సినిమాతో మరోసారి రుజువయ్యింది. జక్కన్న తీసిన సినిమాల్లో ఇప్పటికీ మెస్మరైజ్ చేసే సినిమా ఈగ అని చెప్పాలి. రామ్ చరణ్ తో మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి ఏ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో తీసిన ఈగ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికి టీవీలల్లో వస్తే కళ్లు ఆర్పకుండా చూసే జనాలు ఉన్నారు అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాతోనే అసలు సిసలు గ్రాఫిక్స్‌ మాయాజాలం ఎలా ఉంటోందో నేర్చుకున్నారు రాజమౌళి. ఈగ లాంటి అల్ప జీవిని వెండితెరపై ఓ అద్భుత కథానాయకుడిగా మలచడం కోసం ఆయనెన్నో వ్యయ ప్రయాసలకోర్చారు. ఈగను యానిమేషన్‌లో సృష్టించడం ఒకెత్తైతే.. రియాలిటీ లైఫ్ కు దగ్గరగా భావోద్వేగాలు పలికించగలగడం మరొకెత్తు. ఇది ఈ సినిమాకి హైలెట్ అని చెప్పడాం కాదు సినిమా మొత్తం సూపర్ గా ఉంటుంది అంటారు ఈ సినిమా చూసిన జనాలు. నాని సమంత మధ్య లవ్ సీన్స్..ఈగ పగ తీర్చుకునే క్రమ్మలో సుదీప్ తో చేసే కామెడీ అన్ని కలిపి సినిమా ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తీయ్యడాని మెయిన్ రీజన్ ఏంటో రాజమౌళొ చెబుతూ..”ఈగ అనేది చిన్న ప్రురుగు.. చేతితో సులువుగా విదిలించికోగలం.. కానీ, అలాంటి జీవి మనిషి పై పగబడ్డితే.. ఆసక్తికరంగా ఉంటుందని భావించి” ఈ సినిమాను తీసాడట. ఈగ చిత్రం కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్‌లో ఉంచాడట. ఆ ఫ్రిజ్‌లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో తారక్‌ చెప్పినట్లు తెలుస్తుంది. ఈగల సుప్తావస్థ గురించి తెలుసుకునేందుకే జక్కన్న అలా చేశారని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తారు. అందుకు ఎంత పరిశోధన అయినా చేస్తారు అని చెప్పేందుకు ‘ఈగ’ సినిమానే ఒక ఉదాహరణ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news