Moviesఏ హీరోకు ఏం సీక్రెట్ చెపితే కాల్షీట్లు ఇస్తారో లీక్ చేసిన...

ఏ హీరోకు ఏం సీక్రెట్ చెపితే కాల్షీట్లు ఇస్తారో లీక్ చేసిన పూరి…!

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ స్టైలే వేరు. పూరి ఎవ‌రేమ‌నుకున్నా తాను ఏం చేయాలో అదే చేస్తారు. ఆయ‌న ఏం చెప్పాల‌నుకుంటున్నారో ? అదే చెపుతారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్ట‌ర్ అయినా పెద్ద హీరోల‌తో సినిమాలు చేయాలంటే క‌నీసం యేడాది ప‌డుతుంది. అదే పూరికి అయితే రెండు నెల‌లే.. మ‌హా అయితే ఆరు నెల‌ల్లో సినిమా తీసేస్తాడు. పూరికి క‌థ రాయ‌డం కూడా ప‌ది రోజులు ప‌డుతుంది… నాలుగైదు రోజుల్లో కూడా క‌థ‌లు రాసి సినిమాలు తీసి హిట్లు కొట్టిన సంద‌ర్భాలు కూడా పూరికి ఉన్నాయి.

పూరి బాల‌య్య‌, నాగ్‌, ఎన్టీఆర్‌, చెర్రీ, బ‌న్నీ, ప్ర‌భాస్‌, జ‌గ‌ప‌తిబాబు, ప‌వ‌న్, మ‌హేష్‌ లాంటి స్టార్ల‌తో సినిమాలు తీశారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా పూరితో సినిమా చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. పూరి వ‌ర్క్ స్టైల్ అలా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పూరి ఏ హీరోకు ఏం చెపితే వెంట‌నే కాల్షీట్లు ఇస్తారో ? ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు.

విల‌న్ పెద్ద గ‌న్ డీల‌ర్ అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు కాల్చుకోవ‌చ్చు అని చెపితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే కాల్షీట్లు ఇచ్చేస్తార‌ట‌. సినిమా షూటింగ్ అంతా ఇండోర్ సెట్లోనే చేస్తున్నాం అంటే ప్ర‌భాస్ ఓకే చెప్పేస్తాడ‌ట‌. ఇండ‌స్ట్రీలో రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌దాం.. కుమ్మేద్దాం భ‌య్యా అంటే ఎన్టీఆర్ సినిమాకు వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తార‌ట‌. 30 రోజుల్లో సినిమా లాగించేద్దాం అంటే ర‌వితేజ వెంట‌నే సంబ‌రప‌డి ఓకే చెప్పేస్తాడ‌ట‌.

రేపు సినిమా మొద‌ల‌వుతుంది.. ఎప్పుడు పూర్త‌వుతుందో తెలియ‌దు అని మ‌హేష్‌కు చెపితే స‌రే అంటాడ‌ట‌. ఇదంతా ఇండ‌స్ట్రీలో ఉన్న టాక్ మాత్ర‌మే అని పూరి తెలిపాడు. ఓ సినిమా ఫంక్ష‌న్లో పూరి ఈ విష‌యం చెప్ప‌డంతో కింద ఉన్న మ‌హేష్ – న‌మ్ర‌త ప‌గ‌ల‌బ‌డి మ‌రీ న‌వ్వేశారు. ఇక ఇస్మార్ట్‌శంక‌ర్ సినిమాతో తిరిగి ట్రాక్లోకి వ‌చ్చిన పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా భారీ బ‌డ్జెట్తో తెరకెక్క‌డంతో పాటు పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news