Moviesఅనుష్క తన లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఇదే..?

అనుష్క తన లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఇదే..?

స్టార్ హీరోల‌కి సమానంగా పాపులారిటీ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళల్లో మొదటగా మనకు గుర్తు వచ్చే పేరు అనుష్క‌.అప్పుడెప్పుడో 16ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున సూపర్ అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత వరుసుగా అవకాశాలను అందుకుంటూ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. తెలుగులో అయితే చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ హీరోల‌తో పాటు మ‌హేష్‌బాబు లాంటి యంగ్ హీరోల స‌ర‌స‌న కూడా సినిమాలు చేసింది.

అనుష్క..తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ. అంతేకాదు హీరోయిన్స్ అంటే గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు.. ఓ సినిమా హిట్ అవ్వాలంటే హీరోనే ఉండక్కర్లేదు అంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి..స్టార్ హీరోలకు సైతం తన నటనతో చెమటలు పట్టించిన నటి ఈ అనుష్క. కాగా గత కొంత కాలంగా ఆమె హవా తగ్గిందనే చెప్పాలి. కెర్రిర్ మొదట్లో ఉన్నంత స్పీడ్ మీద ఇప్పుడు లేదు అనుష్క.

అయితే అనుష్క వ‌య‌స్సు నాలుగు ప‌దుల‌కు చేరువ అవుతున్నా ఆమె ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఆమె వయసు ఉన్న మిగత హీరోయిన్లందరు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇక నయనతారకూడా వచ్చే ఏడాది మొదటి నెలలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ అనుష్క మాత్రం పెళ్లి కి సంబంధించిన తీపికబురే చెప్పట్లేదు. ఇంత వయసు వచ్చినా అమ్మడుకి పెళ్లి కాకపోవడానికి కారణం ఆమె జాతకంలో ఓ పెద్ద దోషం ఉందట.

దానికి దోషనివారణ చేస్తే గానీ ఆ దోషం పోదట. ఇదే విషయమే అనుష్కకు చెప్పితే తాను ఇలాంటివి నమ్మనని..మరోసారి ఇలాంటి విషయాలు ఆమెదగ్గర ప్రస్తావించద్దని తెగేసి చెప్పిందట. అనుష్క అలా చేసి లైఫ్ లో పెద్ద తప్పు చేసిందని అంటున్నారు నెటిజన్స్. దోష నివారణ చేస్తే తప్పేముంది అంటున్నారు మరి అనుష్క పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news