Moviesఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్ అవ్వగలరు..రష్మిక సంచలన వ్యాఖ్యలు

ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్ అవ్వగలరు..రష్మిక సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.

‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది కన్నడ భామ రష్మిక మందన. ”గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు భీష్మ” లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. రీసెంట్ గానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన డీ గ్లామరస్ లుక్ లో కనిపించి తన నటనతో మెప్పించిన్ ఈ భామ..ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక రష్మిక తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా తన ఇన్‌స్టా స్టేటస్‌లో .. హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్న వారికి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు ఉంది ఆ మెసేజ్ చూస్తుంటే. ఆమె పోస్ట్ చేస్తూ రష్మిక ఎరుపెక్కిన తన చేయి ఫోటోని పెట్టి ‘మీలో ఎవరైనా హీరోయిన్‌ కావాలనుకుంటున్నారా? మంచి విషయమే, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు చాలా సార్లు లేజర్ చికిత్స( చర్మంపై వెంట్రుకలు లేకుండా నున్నగా గీసేస్తారు) చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలా మందికి తెలియకపోవచ్చు ఇది. కానీ హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇది నిజంగా చాలా నొప్పి పెట్టేది’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news