Moviesశ్యామ్‌సింగ‌రాయ్ హీరోయిన్ మ‌డోన్నా స్టెబాస్టియ‌న్ ఎవ‌రో తెలుసా..!

శ్యామ్‌సింగ‌రాయ్ హీరోయిన్ మ‌డోన్నా స్టెబాస్టియ‌న్ ఎవ‌రో తెలుసా..!

నేచురల్ స్టార్ నాని – సాయి పల్లవి – కృతి శెట్టి జంటగా నటించిన శ్యామ్‌సింగ‌రాయ్‌ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రు. 20 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టిన సింగరాయ రు. 12 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది. ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గిపోవటం… చాలా థియేటర్లు మూసివేయడం జరగకపోతే శ్యాం సింగరాయ ఇప్పటికే రు. 20 కోట్లకు పైగా షేర్‌ రాబట్టి ఉండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

ఈ సినిమాలో నాని నటనతో పాటు సాయి పల్లవి అందం… అభినయం, కృతి శెట్టి గ్లామర్, రాహుల్ డైరెక్షన్ అన్ని హైలైట్ అయ్యాయి. శ్యాం సింగరాయలో కృతి శెట్టి సాయి పల్లవితో బాటు మరో హీరోయిన్‌గా మడోన్నా సెబాస్టియన్ కూడా నటించింది. ఆమె గతంలో నాగచైతన్య బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమ‌మ్‌ సినిమాలోనూ నటించింది. ఆమె వ్య‌క్తిగ‌తం విష‌యానికి వ‌స్తే కేర‌ళ‌లోని ఎర్నాకుళంలో మ‌డోన్నా జ‌న్మించింది.

 

 

ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు. ఆమె బెంగ‌ళూరులోని క్రైస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌లో డిగ్రీ ప‌ట్టా పొందింది. ఆమె మ్యూజిక్ కాన్స‌ర్ట్స్‌కు యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. క‌ర్నాట‌క‌, ప‌శ్చాత్య సంగీతంలో మంచి ప‌ట్టున్న ఆమె మ్యూజిక్ మోజో షోతో పాపుల‌ర్ అయ్యింది. సూర్య టీవీలో ఓ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తోన్న టైంలో ప్రేమ‌మ్ ద‌ర్శ‌కుడు అల్ఫోన్స్ పుతారెన్ తన ప్రాజెక్ట్ కోసం మడోన్నాను ఆడిష‌న్స్‌కు పిలిచాడు.

ఇందులో మేరీ పాత్ర‌కు ఆమెను సెల‌క్ట్ చేశాడు. అయితే మ‌డోన్నా తాను సెలెన్ పాత్రే చేస్తాన‌న‌డంతో చివ‌ర‌కు మేరీ పాత్ర అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత కోలీవుడ్‌లో కాద‌లుమ్ కాదందు పోగుమ్ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇక తెలుగులో చైతు ప‌క్క‌న కూడా ఆమె ప్రేమ‌మ్ సినిమా చేసింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ కాస్త గ్యాప్ త‌ర్వాత నాని శ్యామ్‌సింగ‌రాయ్‌లో న‌టించింది. మ‌డోన్నా సౌత్ సినిమాలో ఇప్పుడు అన్ని భాష‌ల్లోనూ మంచి ఛాన్సులు కొట్టేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news