Moviesషాక్: రాజ‌మౌళి సినిమా కెరీర్‌కు మైన‌స్ అన్న న‌టుడు..!

షాక్: రాజ‌మౌళి సినిమా కెరీర్‌కు మైన‌స్ అన్న న‌టుడు..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌ర్యాద రామ‌న్న సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు న‌టుడు నాగినీడు. ఆ సినిమా కంటే మేందు నాగినీడు తెలుగులో చాలా సినిమాలు చేసినా కూడా ఆ సినిమాతోనే బాగా గుర్తింపు వ‌చ్చింది. అక్క‌డ నుంచి మంచి ఛాన్సులు వ‌చ్చాయి. మీడియా ముందుకు త‌క్కువుగా వ‌చ్చే నాగినీడు తాజాగా ఆలీతో స‌ర‌దాగా షో కార్య‌క్ర‌మానికి వ‌చ్చాడు. ఈ షోలో నాగినీడు ఆలీ డైలాగ్స్ చెప్పి న‌వ్వించారు.

ఏ సినిమా అయితే నాగినీడుకు గుర్తింపు వ‌చ్చిందో అదే సినిమా త‌న‌ను పైన కూర్చోపెట్టి త‌న కెరీర్‌కు పెద్ద మైన‌స్ అయ్యింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌ర్యాద రామ‌న్న సినిమా త‌ర్వాత తాను క్యారెక్ట‌ర్ల కోసం ఎంతో మందిని అప్రోచ్ అయ్యాన‌ని.. అయితే వారంతా కూడా మీరు చేసే ద‌మ్మున్న క్యారెక్ట‌ర్ మాత్ర‌మే మీకు ఇస్తాం త‌ప్పా.. ఏదో సాధార‌ణ క్యారెక్ట‌ర్ తాము ఇవ్వ‌లేం అని చెప్పేసేవార‌ట‌.

అయితే త‌న‌కు మాత్రం మ‌న‌సులో ఎక్క‌వ క్యారెక్ట‌ర్లు రావాల‌ని.. డ‌బ్బులు వ‌స్తే చాలు త‌ప్పా.. ఏ క్యారెక్ట‌ర్ అయితే ఏంట‌న్న అసంతృప్తి ఉండేద‌ని చెప్పారు. అయితే తాను స్టైల్ కోస‌మే తాయొత్తులు క‌ట్టుకుంటాన‌ని కూడా చెప్పారు. ఏదేమైనా రాజ‌మౌళి సినిమాల్లో న‌టించిన స్టార్ హీరోల‌కు త‌ర్వాత హిట్లు రావ‌న్న టాక్ ఉంది. రాజ‌మౌళి త‌న సినిమాల్లో హీరోల‌ను ఆకాశంలో చూపిస్తారు.

ఆ త‌ర్వాత ద‌ర్శ‌కులు ఆ రేంజ్‌లో చూపించరు. అందుకే వాళ్లు రాజ‌మౌళితో చేసిన సినిమా రేంజ్ హిట్లు త‌ర్వాత ప‌డ‌వు. ఇప్పుడు నాగినీడు కూడా ఆయ‌న సినిమాలో న‌టిస్తే ఆ రేంజ్ క్యారెక్ట‌ర్లు ఇవ్వాల‌నే త‌న‌ను మిగిలిన ద‌ర్శ‌కులు కూడా చూశార‌ని.. అది అలా మైన‌స్ అయ్యింద‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news