Moviesఒకే క‌థ‌తో సినిమాలు చేసిన ఎన్టీఆర్ - గోపీచంద్‌.. ఆ సినిమాలు...

ఒకే క‌థ‌తో సినిమాలు చేసిన ఎన్టీఆర్ – గోపీచంద్‌.. ఆ సినిమాలు ఇవే..!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా గతంలో ఒక సినిమాగా వచ్చిన కథతోనే… మరో సినిమా తియ్యటం సహజం. చాలా సినిమాల్లో కథలు కొన్ని పోలికలు ఒకేలా ఉంటాయి. ఇటీవల పరుచూరి చెప్పినట్టుగా దేవదాసు – అర్జున్ రెడ్డి సినిమా కథ ఒకటే. అయితే వాటి కథనాలు మాత్రమే వేరు. అలాగే కొన్ని సినిమాల్లో పాత సినిమాలు చాయలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అనూహ్యంగా ఇంచుమించు ఒకే కథను పోలి ఉన్న సినిమాలు కూడా కొందరు హీరోలు చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాస్ హీరో గోపీచంద్ ఇద్ద‌రు నటించిన రెండు సినిమాలు దాదాపు ఒకే కథతో తెరకెక్కడంతో పాటు ఒకే సంవత్సరం రిలీజ్ అయ్యాయి. అయితే రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. గోపీచంద్ – దీక్షా సేథ్ జంటగా నటించిన వాంటెడ్ సినిమా 2011లో రిలీజ్ అయింది. బి.వి.ఎస్.రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజాస్ట‌ర్‌ అయింది. అలాగే అదే సంవత్సరం ద‌స‌రాకు ఎన్టీఆర్ – తమన్నా జంటగా నటించిన ఊసరవెల్లి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.

ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ ఫ్యామిలీ అంతా విల‌న్ల‌ చేతిలో చనిపోతారు. చివరకు హీరోయిన్లు … హీరోలను ప్రేమించాలంటే తమ కుటుంబాన్ని చంపిన విలన్‌ను చంపాలని కండిషన్ పెడతారు. విచిత్రమేంటంటే ఈ రెండు సినిమాల్లోనూ ప్రకాష్ రాజ్ కాగా… హీరోయిన్ ఫ్యామిలీలో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటారు. విచిత్రమేమిటంటే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news