Moviesనాగార్జునకు సంక్రాంతికి ఇంత సెంటిమెంట్ ఉందా..!

నాగార్జునకు సంక్రాంతికి ఇంత సెంటిమెంట్ ఉందా..!

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో తేదీ కలిసి వచ్చినట్లుగానే, మన నాగార్జున కి కూడా సంక్రాంతి బాగా కలిసి వస్తుందని అంటున్నారు. ఇకపోతే నాగార్జున తన సినీ కెరీర్లో సంక్రాంతికి వచ్చి , బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మూవీస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

MAJNU | TELUGU FULL MOVIE | NAGARJUNA | RAJINI | DASARI NARAYANA RAO | V9  VIDEOS - YouTube

1. మజ్ను:
1987 సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ నారాయణరావు దర్శకత్వం వహించారు. అప్పటికే వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నాగార్జునకు మజ్ను సినిమా మంచి బ్రేక్ ను అందించింది. హీరోయిన్ గా రజనీ నటించి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా ఎమోషనల్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో, అందరూ ఈ సినిమాకు అప్పట్లో ఫిదా అయ్యారు.

Killer Telugu Full length Movie || Nagarjuna, Nagma, Baby Shamili || Latest Telugu  Movies - YouTube

2. కిల్లర్:
1992 వ సంవత్సరంలో దర్శకుడు ఫాజిల్ డైరెక్ట్ చేసిన చిత్రం కిల్లర్ . ఇది కూడా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో నగ్మా హీరోయిన్ గా , శారదా కీలక పాత్రలో నటించి మెప్పించారు.

Two In One Full Song ll Aavida Maa Aavide Movie Songs ll Nagarjuna,Tabu,  Heera - YouTube

3. ఆవిడ మా ఆవిడే:
1998 జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకుడిగా పని చేశారు. ఇక ఇందులో టబు నటన అందరినీ మెప్పించింది.

Soggade Chinni Nayana (2016)

4. సోగ్గాడే చిన్ని నాయ‌నా:
2016 సంవత్సరం జనవరి 15వ తేదీన కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఇక ఇందులో నాగార్జున డ్యూయల్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇందులో సరికొత్తగా చనిపోయిన వ్యక్తి పరకాయ ప్రవేశం చేసి నటించడం అందరినీ ఆకట్టుకుంది. రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాఠి, ఝాన్సీ తదితరులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news