Moviesఅడ్రస్ లేకుండా పోయిన జగపతి బాబు హీరోయిన్..ఇపుడు ఎలా ఉందో తెలిస్తే...

అడ్రస్ లేకుండా పోయిన జగపతి బాబు హీరోయిన్..ఇపుడు ఎలా ఉందో తెలిస్తే షాకే..!!

రంగుల ప్రపంచం మాయలోకం ఇలా సినిమా పరిశ్రమకు ఎన్నో పేర్లు. ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. లేకుంటే పత్తాలేకుండా పోతారు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటేనే ఓ మాయలోకం. ఈ రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎవరిని పడేస్తుందో కూడా తెలియదు.

ఒకసారి హిట్ కొడితే పలకరించే అదే సినీ జనాలు ఫ్లోప్ వస్తే మాత్రం పట్టించుకోరు.. అప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకటైతే ఫ్లోప్ వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్ళు ఫ్లోప్ సినిమాకు దూరంగా ఉంటారు. హిట్టుతో ఎంత గుర్తింపు వస్తుందో ఫ్లాప్ తో అంతకంటే దారుణ స్థితి నెలకొంటుంది.

“పెళ్ళి కానుక”.. ఈ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. 1998 లో విడుదలైన తెలుగు సినిమా “పెళ్ళి కానుక”. దీనిని ఎన్విఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో నన్నపనేని అన్నా రావు నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, లక్ష్మి, భానుమతీ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది. షారుఖ్ ఖాన్, మహిమా చౌదరి నటించిన 1997 బాలీవుడ్ చిత్రం పర్‌దేస్కు రీమేక్ ఈ సినిమా.

అయితే “లక్ష్మి” తెలుగులో జగపతి బాబు హీరోగా నటించిన “పెళ్లి కానుక” అనే చిత్రంలో హీరోయిన్‌ గా నటించి అందరిని మెప్పించి..తన నటనకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రముఖుల నుండి మంచి మార్కులే వేయించుకుంది. అయితే పమైందో ఏమోగాని ఈ చిత్రంలో నటించిన తర్వాత నటి లక్ష్మి మళ్లీ సినిమాల్లో నటించలేదు.

అయితే కొందరి సినీ ప్రముఖుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. నటి లక్ష్మి కి కుటుంబ సమస్యలు ఎదురవడంతో ఇండస్ట్రీని వదిలి.. ఉద్యోగం చేస్తూ సెటిల్‌ అయిందట. కానీ ప్రస్తుతం నటి లక్ష్మి ఎక్కడుంది.? ఏం చేస్తుందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ లక్ష్మి ఏం చేస్తుందో.. ఏక్కడుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news