Moviesబిగ్ బాస్ 4 : వామ్మో.. సమంత అంత ఖరీదైన...

బిగ్ బాస్ 4 : వామ్మో.. సమంత అంత ఖరీదైన చీర కట్టుకుందా..?

బిగ్ బాస్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. కొన్ని లవ్ స్టోరీలు కొన్ని కాంట్రవర్సీలు మరికొన్ని టాస్కులు ఇలా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది బిగ్ బాస్ సీజన్ 4. అంతేకాదు వారాంతంలో నాగార్జున వచ్చి చేసే సందడి కూడా అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే నాగార్జున షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం తో అక్కినేని వారి కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

 

 

 

 

ఇక బిగ్ బాస్ హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంత మామ నాగార్జునను మరిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వచ్చింది ఒక ఎపిసోడ్ అయినా సరే ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పోస్టింగ్ చేసింది. బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చిన సమంత తెలుగుదనం ఉట్టిపడేలా చీర కట్టుకొని వచ్చింది అనే విషయం తెలిసిందే . అయితే ఈ చీర ఖరీదు ఎంత అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా 44,800 రూపాయలట సమంత కట్టుకున్న చీర ఖరీదు. అంత ఖరీదైన చీర కట్టుకొని సమంత పోస్టింగ్ చేసిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news