Movies'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంతో కీలకం.. ఎందుకంటే..?

‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంతో కీలకం.. ఎందుకంటే..?

ప్రస్తుతం ఓటమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న రాజమౌళి ఆర్ ఆర్ఆర్ అనే మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైనా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగానే జక్కన్న సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే… ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి సార్ హీరోలు ఇద్దరు అంటే అంతకుమించి అనే లాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

 

 

ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల పాత్రకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ లు సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా ముందుగా ఈ సినిమా ఇంటర్వెల్ కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట జక్కన్న. సినిమా మొత్తానికి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంతో కీలకంగా మారనుందట.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట జక్కన్న. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టు పోతుంది అని అటు టాలీవుడ్లో కూడా టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news