Gossipsకాజ‌ల్ పెళ్లితో దేవ‌దాస్‌గా మారిన టాలీవుడ్ హీరో.. ఒక్క‌టే వైర‌ల్‌..!

కాజ‌ల్ పెళ్లితో దేవ‌దాస్‌గా మారిన టాలీవుడ్ హీరో.. ఒక్క‌టే వైర‌ల్‌..!

ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ ఎట్ట‌కేల‌కు ఈ నెల 30న త‌న పెళ్లి అంటూ ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి ఒక్క‌సారిగా షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాజ‌ల్ పెళ్లిపై వ‌చ్చిన పుకార్ల‌కు కూడా ఎట్ట‌కేల‌కు చెక్ పెట్టేసింది. కాజ‌ల్ త‌న స్నేహితుడు, వ్యాపార‌వేత్త అయిన గౌతం కిచ్లుతో పెళ్ళికి రెడీ అవుతోంది. కాజ‌ల్ పెళ్లి ప్ర‌క‌ట‌న‌తో ప‌లువురు హీరోలు ఆమెకు ముందుగానే శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. అయితే ఓ టాలీవుడ్ కుర్ర హీరో మాత్రం ఆమె పెళ్లి ప్ర‌క‌ట‌న‌తో దేవాస్ అయిపోయాడంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ జ‌రుగుతోంది.

 

 

ఆ హీరో ఎవ‌రో కాదు కాజ‌ల్‌తో సీత‌, కవ‌చం సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ రెండు సినిమాలు వ‌రుస‌గానే వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో వీరు క్లోజ్ అయిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఆ టైంలో సీనియ‌ర్ హీరోయిన్ మోజులో కుర్ర హీరో అని కూడా వార్తలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌నోడు సినిమా కోసం గెడ్డం పెంచితే నెటిజ‌న్లు కుర్రోడు కాజ‌ల్ పెళ్లి వార్త‌తో గెడ్డం పెంచి దేవ‌దాసు అయిపోయ‌డంటూ ట్రోల్ చేస్తున్నారు.

 

బెల్లంకొండ గెడ్డంతో ఉన్న ఫొటోలు కాజ‌ల్ ఫొటోలు మిక్స్ చేసి సోష‌ల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఏదేమైనా కాజ‌ల్ పెళ్లి స‌మ‌యంలో మ‌రోసారి ఇలాంటి గాసిప్స్ లేనిపోని వార్త‌ల‌కు ఆజ్యం పోసిన‌ట్ల‌వ్వ‌డంతో పాటు కాజ‌ల్‌, బెల్లంకొండ‌ను చికాకు పెడ‌తాయ‌న‌డంలో డౌట్ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news