Moviesశోభ‌న్‌బాబు బ‌యోపిక్ వ‌స్తోంది... ఆ హీరో ఫిక్స‌యిన‌ట్టే...!

శోభ‌న్‌బాబు బ‌యోపిక్ వ‌స్తోంది… ఆ హీరో ఫిక్స‌యిన‌ట్టే…!

ప్ర‌స్తుతం అన్ని భాషల్లోనూ బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు ప‌లువురు హీరోలు, సెల‌బ్రిటీల బ‌యోపిక్‌లు తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత జీవిత క‌థ‌ను ఏ.ఎల్‌. విజ‌య్ త‌లైవి పేరుతో కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్రలో రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే న‌ట‌భూష‌ణ్ శోభ‌న్‌బాబు జీవిత క‌థ‌ను ఇప్పుడు తెర‌మీద‌కు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

Untold Story Of Sobhan Babu and Jayalalitha - TimesSouth.com

ఈ క్ర‌మంలోనే శోభ‌న్‌బాబు పాత్రలో టాలీవుడ్ భ‌ళ్లాల‌దేవుడు ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్నాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. శోభ‌న్‌బాబు వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక మ‌లుపులు ఉన్నాయి. ఆయ‌న‌కు జ‌య‌ల‌లిత‌కు మ‌ధ్య ఉన్న బంధం గురించి అంద‌రికి తెలిసిందే. ఆయ‌న జీవితం అనేది ఉత్తాన ప‌త‌నాల క‌ల‌బోత‌. సావిత్రి జీవితంలో ఎన్ని ఎత్తుప‌ల్లాలు ఉన్నాయో శోభ‌న్‌బాబు జీవితంలోనూ అంతే ఎత్తుప‌ల్లాలు ఉన్నాయి. ఆయ‌న మ‌ర‌ణం కూడా అనుమానాస్ప‌ద‌మే అయ్యింది.

Here's the shocking truth behind actor Sobhan Babu and late Tamil Nadu CM  Jayalalitha's affair

శోభ‌న్‌బాబు హీరోగా ఉన్న‌ప్పుడే త‌న‌కు అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయంటూ ఇండ‌స్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు. మ‌రి ఆయ‌న్ను అంత‌లా అవ‌మానించింది ఎవ‌రు ? ఆయ‌న‌కు జ‌య‌ల‌లిత‌కు ఉన్న బంధం ఇవ‌న్నీ క‌లిపితే ఆయ‌న బ‌యోపిక్ మంచి చ‌రిత్ర అవుతుంది. అయితే ఈ సినిమా తీసే వారు అవ‌న్నీ ట‌చ్ ఏస్తారా ? అన్న‌ది కూడా చూడాలి. బ‌యోపిక్ ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయితే మ‌హాన‌టి అవుతుంది.. లేక‌పోతే మ‌హానాయకుడిలా డిజాస్ట‌ర్ అవుతుంద‌నే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌రలోనే వెల్ల‌డి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news