Newsఇండియాలో మోస్ట్ డేంజ‌ర‌స్ లేడీ డాన్లు వీళ్లే..!

ఇండియాలో మోస్ట్ డేంజ‌ర‌స్ లేడీ డాన్లు వీళ్లే..!

డాన్లు అంటే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పురుష డాన్ల‌నే చూశాం.. వారి గురించే ఎక్కువుగా విన్నాం.. అయితే డాన్ల‌లో మ‌గ డాన్లే కాదు లేడీ డాన్లు కూడా ఉన్నారు. డాన్లు అంటే మ‌న‌కు దావూద్ ఇబ్ర‌హీం, చోటా ష‌కీల్‌, చోటా రాజ‌న్ ఇలాంటి పేర్లే గుర్తుకు వ‌స్తాయి. అయితే భార‌త‌దేశంలోనే మోస్ట్ డేంజ‌ర‌స్ లేడీ డాన్లు కూడా ఉన్నారు. వీరు కూడా చాలా రాక్ష‌స గుణంతో ఎంతో మందిని భ‌య‌పెట్టారు. ఒక‌సారి వీరి గురించి చూద్దాం. వీరిలో రేష్మా మేమ‌న్‌, ష‌బానా మేమ‌న్‌ల‌ను ద ఉమెన్ బిహైండ్ ద బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారు. 1993 ముంబై వ‌రుస బాంబు పేళుల్ల కేసుల్లో వీరిద్ద‌రు ప్ర‌ధాన సూత్ర‌దారులు.

వీరిద్ద‌రు ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ టైగ‌ర్ మేమ‌న్ భార్య, చెల్లి. ముంబై బాంబు పేలుళ్లు జ‌రిగి 27 సంవ‌త్స‌రాలు అవుతున్నా వీరిని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుకోలేక‌పోయారు. వీరు క‌రాచీలో ఉంటార‌ని భావిస్తున్నారు. మిస్టీరియ‌స్ గ్యాంగ్ క్వీన్ అన్న పేరున్న శోభా అయ్య‌ర్ త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నో నేరాల‌కు పాల్ప‌డింది. ఆమె ముఖం కూడా ఎలా ఉంటుందో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల‌కు తెలియ‌దు. ఇక ఆమె అరాచ‌కాల‌కు పోలీసులు, రాజ‌కీయ నాయ‌కుల స‌హ‌కారం కూడా ఉందంటారు.

ఇక అర్చ‌నాపాల్ అనే లేడీ డాన్ కిడ్నాప్‌ల‌కు ప్ర‌సిద్ధి.. సినిమాల్లో హీరోయిన్ కావాల‌న్న ఆశ‌తో ఆ కోరిక నెర‌వేర‌క ఈ కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డింది. ఉజ్జ‌యినికి చెందిన అర్చ‌నాపాల్ విదేశాల్లో ఉండి కూడా కిడ్నాప్‌లు చాక‌చ‌క్యంగా చేయించ‌డంలో మంచి నేర్ప‌రి. ఇక అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ అబూస‌లైం భార్య‌ల్లో ఒక‌రు అయిన స‌మైరా జుమాలీకి త‌న భ‌ర్త స‌లేం ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో చాలా వాటితో లింక్ ఉంది. ఇంట‌ర్ పోల్ ఈమెకు వ్య‌తిరేకంగా రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేసిందంటే ఆమె ఎంత ప్ర‌మాద‌క‌రమో తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news