Moviesమ‌హేష్‌కు ప‌వ‌న్ రిప్లే... టాలీవుడ్‌లో సెన్షేష‌నల్ వైర‌ల్‌

మ‌హేష్‌కు ప‌వ‌న్ రిప్లే… టాలీవుడ్‌లో సెన్షేష‌నల్ వైర‌ల్‌

నిన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విషెస్ చెప్పారు. దీనికి తోడు నిన్న ప‌వ‌న్ సినిమాల అప్‌డేట్లు, మోష‌న్ పోస్ట‌ర్లు, ఫ‌స్ట్‌, ప్రీ లుక్‌ల‌తో సోష‌ల్ మీడియా మార్మోగిపోయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌కు అందరికంటే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు చెప్పిన విషెష్ హైలెట్‌గా మారింది. ఇది టోట‌ల్ ఇండ‌స్ట్రీకే చాలా స్పెష‌ల్ అయ్యింద‌న్న చ‌ర్చ న‌డిచింది. మ‌హేష్ నుంచి చాలా యేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌కు వెళ్లిన ట్వీట్ ఇదే కావ‌డంతో దీనిపై అంతా ఆస‌క్తి క‌న‌ప‌రిచారు.

Image

ప‌వ‌న్‌కు మ‌హేష్ బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇంత‌కు మించిన ట్విస్ట్ ఇచ్చాడు ప‌వ‌న్‌. మ‌హేష్ విషెస్‌కు ప‌వ‌న్ రిప్లే ఇస్తాడా ? ఇవ్వ‌డా ? అన్న సందేహం ఉండ‌గా సాయంత్రానికి ప‌వ‌న్ ఆ సందేహం తీర్చేశాడు. ప‌వ‌న్ నుంచి మ‌హేష్ ట్వీట్‌కు రిప్లే వెళ్లింది. ఉద‌యం మ‌హేష్‌బాబు గ‌తంలో తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో దిగిన ఓ ఫొటో షేర్ చేసి ప‌వ‌న్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక సాయంత్రం ప‌వ‌న్ దానికి రిప్లే ఇస్తూ నాకు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన మీకు నా హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అని రిప్లే ఇచ్చాడు.

 

ఏదేమైనా నిన్న ప‌వ‌న్ బ‌ర్తే కానుక‌గా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బిగ్ అప్‌డేట్స్ రావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ మాంచి కిక్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వ‌కీల్‌సాబ్ ద‌స‌రా త‌ర్వాత లేదా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news