Gossipsవిజయ్ దేవరకొండకి భయపడుతున్న దిల్ రాజు..!

విజయ్ దేవరకొండకి భయపడుతున్న దిల్ రాజు..!

బడా నిర్మాత దిల్ రాజు యువ సంచలనం విజయ్ దేవరకొండకు భయపడుతున్నాడని లేటెస్ట్ టాక్. అదేంటి హీరో గురించి నిర్మాత ఎందుకు బయపడుతున్నట్టు అంటే విజయ్ కు పోటీగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా రిలీజ్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నాడట. దిల్ రాజు బ్యానర్ లో నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే.

ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే అదే డేట్ కు విజయ్ నోటా వస్తుందని అనగా దిల్ రాజు తన ప్లాన్ తోనే నోటా సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేసేలా చూశాడట. నోటా ఫైనల్ గా అక్టోబర్ మొదటి వారమే వస్తుంది. గీతా గోవిందం సక్సెస్ మీట్ లో విజయ్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చిన దిల్ రాజు అతని సినిమా వల్ల వారం ముందు వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా ఫ్లాప్ అయ్యిందని ఫీల్ అవుతున్నాడు.

అందుకే విజయ్ నోటా, రాం హలో గురు ప్రేమ కోసమే రెండు సినిమాలు ఒకేరోజున వస్తే కష్టమని. నోటాని అక్టోబర్ 5కి రిలీజ్ అయ్యేలా స్కెచ్ వేశాడు. మరి దిల్ రాజు ప్లాన్ ప్రకారం రిలీజ్ అవుతున్న విజయ్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news